Miami Open 2025: జొకోవిచ్‌కు చుక్కెదురు  | Miami Open 2025: Novak Djokovic misses century mark | Sakshi
Sakshi News home page

Miami Open 2025: జొకోవిచ్‌కు చుక్కెదురు 

Apr 1 2025 4:41 AM | Updated on Apr 1 2025 4:41 AM

Miami Open 2025: Novak Djokovic misses century mark

మయామి ఓపెన్‌ ఫైనల్లో ‘చెక్‌’ టీనేజర్‌ చేతిలో పరాజయం  

ఫ్లోరిడా: కెరీర్‌లో 100వ సింగిల్స్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌కు నిరాశ ఎదురైంది. 2019 తర్వాత పాల్గొన్న మయామి ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 సిరీస్‌ టెన్నిస్‌ టోర్నీలో జొకోవిచ్‌ రన్నరప్‌గా నిలిచాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన 19 ఏళ్ల జాకుబ్‌ మెన్‌సిక్‌ అసాధారణ ఆటతీరు కనబరిచి జొకోవిచ్‌కు షాక్‌ ఇచ్చాడు. 

2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో మెన్‌సిక్‌ 7–6 (7/4), 7–6 (7/4)తో గతంలో ఆరుసార్లు మయామి ఓపెన్‌ చాంపియన్‌గా నిలిచిన జొకోవిచ్‌ను బోల్తా కొట్టించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెన్‌సిక్‌ 14 ఏస్‌లతో అదరగొట్టాడు. ఇద్దరూ తమ సర్వీస్‌లను ఒక్కోసారి కోల్పోగా... టైబ్రేక్‌లలో మెన్‌సిక్‌ పైచేయి సాధించి తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. 

విజేతగా నిలిచిన మెన్‌సిక్‌కు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ జొకోవిచ్‌కు 5,97,80 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 650 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఈ విజయంతో మెన్‌సిక్‌ ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 30 స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ 24వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement