ఆఖరి నిమిషంలో గోల్‌.. ఓటమి తప్పించుకున్న మాజీ చాంపియన్‌ | Maxi Araujo scored-Last Minute-Goal-For-Uruguay Draw With-Saudi Arabia | Sakshi
Sakshi News home page

ఆఖరి నిమిషంలో గోల్‌.. ఓటమి తప్పించుకున్న మాజీ చాంపియన్‌

Jun 16 2026 7:08 AM | Updated on Jun 16 2026 12:17 PM

Maxi Araujo scored-Last Minute-Goal-For-Uruguay Draw With-Saudi Arabia

సౌదీ తరఫున గోల్‌ కొడుతున్న అబ్దుల్లా అ‍మ్రీ, ఇన్‌సెట్‌లో ఉరుగ్వే ప్లేయర్‌ మాక్సి అరౌజా

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా రెండుసార్లు చాంపియ‌న్స్ అయిన ఉరుగ్వే తృటిలో ఓట‌మి నుంచి త‌ప్పించుకుంది. గ్రూప్‌-హెచ్‌లో భాగంగా సౌదీ అరేబియాతో జ‌రిగిన మ్యాచ్‌ను ఉరుగ్వే 1-1తో డ్రా చేసుకుంది. సౌదీ అరేబియా త‌ర‌ఫున ఆట 41వ నిమిషంలో అబ్దులేలాహ్ అల్ అమ్రి గోల్ చేయ‌గా, ఉరుగ్వే త‌ర‌ఫున ఆట 80వ నిమిషంలో  మాక్సీ అరౌజో  గోల్ కొట్ట‌డంతో ఉరుగ్వే బ‌తికిపోయింది. లేదంటే సౌదీ అరేబియాకు మరో అద్భుత విజయం ఖాతాలో పడేదే. 

2022లో ఖతార్ వేదికగా జరిగిన ప్ర‌పంచ‌క‌ప్ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాను ఓడించి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇరుజట్లు మ్యాచ్ డ్రా చేసుకోవ‌డంతో చెరో పాయింట్ పంచుకున్నాయి. మ్యాచ్ ప్రారంభ‌మైన ఐద‌వ నిమిషంలోనే ఉరుగ్వే గోల్‌కొట్టే అవ‌కాశాన్ని మిస్ చేసుకుంది.  

బాక్స్ అంచు నుంచి మాక్సీ అరౌజో కొట్టిన షాట్‌ను గోల్ కీపర్ మొహమ్మద్ అలోవైస్ స‌మ‌ర్థంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఉరుగ్వేకు కార్నర్ లభించినా, గోల్ చేయడంలో విఫ‌ల‌మైంది. 18వ నిమిషంలో ఉరుగ్వే కొట్టిన మొదటి షాట్ గోల్‌పోస్టు త‌గులుకుంటూ వెళ్లిపోయింది తగిలింది. ఆ త‌ర్వాత 30వ నిమిషంలో మ‌రోసారి గోల్‌కొట్టే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఈసారి కూడా సౌదీ గోల్ కీప‌ర్ అడ్డుగోడ‌లా నిల‌బ‌డ్డాడు. ఆ తర్వాత నుంచి సౌదీ ఆటగాళ్లు ఉరుగ్వే గోల్‌పోస్ట్‌పై దాడులు చేయ‌డం ప్రారంభించారు.

అలా మ్యాచ్ 41వ నిమిషంలో మిడ్ ఫీల్డ‌ర్ అబ్దుల్లా అల్-అమ్రీ గోల్ కొట్ట‌డంతో తొలి హాఫ్ ముగిసేస‌రికి సౌదీ ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో హాఫ్‌లోనూ ఉరుగ్వే ప‌లుమార్లు గోల్‌పోస్ట్‌ల‌పై దాడులు చేసిన‌ప్ప‌టికీ స‌ఫ‌లం కాలేక‌పోయింది. ఇక మ్యాచ్‌లో ఓట‌మి ఖాయ‌మ‌నుకున్న ద‌శ‌లో 80వ నిమిషంలో మాక్సి అరౌజ్ గోల్ కొట్టి స్కోరును స‌మం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement