శివాలెత్తిన స్టోయినిస్‌.. సిక్సర్ల సునామీ | Marcus Stoinis launches five sixes in six balls vs Washington Freedom | Sakshi
Sakshi News home page

శివాలెత్తిన స్టోయినిస్‌.. సిక్సర్ల సునామీ

Jun 27 2026 2:32 PM | Updated on Jun 27 2026 2:50 PM

Marcus Stoinis launches five sixes in six balls vs Washington Freedom

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ (సియాటిల్ ఓర్కాస్‌) చెలరేగిపోయాడు. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు భారీ సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో ఓర్కాస్‌ తొలుత బ్యాటింగ్‌ చేయగా.. ఇయాన్ హాలండ్ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో స్టోయినిస్‌ ఈ ఘనత సాధించాడు. తొలి నాలుగు బంతులను, ఆతర్వాత ఆరో బంతిని సిక్సర్లుగా మలిచిన అతడు.. ఐదో బంతికి డాట్ కావడంతో వరుసగా ఆరు సిక్సర్ల అరుదైన ఘనత చేజార్చుకున్నాడు. 

తదుపరి ఓవర్‌లో మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో మరో సిక్సర్ కొట్టి, ఆ వెంటనే ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు మొత్తం 16 బంతులు ఎదుర్కొని 6 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు.

మరోపక్క షిమ్రోన్‌ హెట్‌మైర్‌ కూడా శివాలెత్తడంతో ఓర్కాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. హెట్‌మైర్ కేవలం 33 బంతుల్లో 2 ఫోర్లు, 9 భారీ సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేశాడు.

లక్ష్యఛేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ 139 పరుగులకే ఆలౌట్ కావడంతో సియాటిల్ ఓర్కాస్ 88 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. జస్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి (5/24) ఓర్కాస్‌ను గెలిపించాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement