సౌతాఫ్రికా ప్లేయ‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు.. 120 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి | Marco Jansen Creates History, Becomes First Player In World After 120 Years | Sakshi
Sakshi News home page

SA vs SL: సౌతాఫ్రికా ప్లేయ‌ర్ వ‌ర‌ల్డ్ రికార్డు.. 120 ఏళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి

Published Fri, Nov 29 2024 4:20 PM | Last Updated on Fri, Nov 29 2024 6:23 PM

Marco Jansen Creates History, Becomes First Player In World After 120 Years

డర్బన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సంచలన బౌలింగ్‌తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్‌​ ధాటికి లంకేయులు విల్లవిల్లాడారు.

తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జాన్సెన్‌.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా పర్యాటక లంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది.

చరిత్ర సృష్టించిన జాన్సెన్‌...
ఇక​ సంచలన ప్రదర్శన చేసిన జాన్సెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 7 వికెట్ల ఘనత సాధించిన ఆసీస్ దిగ్గజం హ్యూ ట్రంబుల్ రికార్డును జాన్సెన్ సమం చేశాడు. మార్కో జాన్సెన్ 6.5 ఓవర్ల(41 బంతులు)లో ఈ ఫీట్ సాధించగా.. హ్యూ ట్రంబుల్ కూడా సరిగ్గా 6.5 ఓవర్ల(41 బంతులు)లోనే ఈ రికార్డును నమోదు చేశాడు.

1902లో ఇంగ్లండ్‌పై హ్యూ ట్రంబుల్ ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇప్పుడు 120 ఏళ్ల తర్వాత జాన్సెన్ ఈ రేట్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దిరి తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా లెజెండ్ మాంటీ నోబెల్ ఉన్నారు. నోబెల్ ఈ రికార్డును 7.4 ఓవర్లలో క్రియేట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ప్రోటీస్ ప్రస్తుతం 406 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: Asia Cup 2024: రేపే భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌.. లైవ్ ఎక్క‌డో తెలుసా?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement