నార్వే చెస్ టోర్నీ విజేత‌గా మాగ్నస్ కార్ల్‌సన్.. గుకేశ్‌కు నిరాశ‌ | Magnus Carlsen wins Norway event after Gukesh blunders vs Caruana | Sakshi
Sakshi News home page

నార్వే చెస్ టోర్నీ విజేత‌గా మాగ్నస్ కార్ల్‌సన్.. గుకేశ్‌కు నిరాశ‌

Jun 7 2025 4:35 PM | Updated on Jun 7 2025 5:46 PM

Magnus Carlsen wins Norway event after Gukesh blunders vs Caruana

నార్వే చెస్​ 2025 టోర్నమెంట్ విజేత‌గా  ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్ నిలిచాడు. ప్రస్తుత వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్‌, భార‌త యువ సంచ‌ల‌నం డి. గుకేష్, అమెరికా గ్రాండ్ మాస్ట‌ర్ ఫాబియానో ​​కరువానాను ఓడించి టైటిల్‌ను మాగ్న‌స్‌ గెలుచుకున్నాడు. ఆఖ‌రి రౌండ్‌లోకి వెళ్లేముందు కార్ల్‌సెన్, గుకేష్ మ‌ధ్య కేవలం అర పాయింట్ తేడా మాత్రమే ఉండేది. 

ఈ క్ర‌మంలో గుకేశ్​ కీల‌కమైన ప‌దో రౌండ్‌లో ఫాబియానో కరువానాతో త‌ల‌ప‌డ్డాడు. నువ్వానేనా జ‌రిగిన చివ‌రి రౌండ్‌లో గుకేశ్ కాస్త ఒత్తిడికి లోన‌య్యి ఓట‌మి చ‌విచూశాడు. దీంతో గుకేశ్ 14.5 పాయింట్లతో మూడో స్థానంలో ప‌రిమియ‌త‌మ‌య్యాడు. 

మ‌రోవైపు కార్ల్‌స‌న్ చివ‌రి రౌండ్‌లో అద‌ర‌గొట్టాడు. భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసితో గేమ్‌ను డ్రా చేసుకుని టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన కార్లెసెన్‌(16 పాయింట్లు)  ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించాడు. ఇక మ‌హిళ‌ల విభాగంలోఉక్రెయిన్ గ్రాండ్‌మాస్టర్ అన్నా ముజిచుక్ 16.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి మూడో స్థానంతో టోర్నీని ముగించింది.
చదవండి: రోహిత్ శర్మకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌?

Advertisement
 
Advertisement
Advertisement