
టీమిండియా స్టార్ ఆటగాడు, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇవాల్టితో (ఆగస్ట్ 18) 17 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2008లో ఇదే రోజున విరాట్ వన్డేల ద్వారా టీమిండియా అరంగేట్రం చేశాడు. నాటి నుంచి విరాట్ ఏం చేశాడో ప్రపంచమంతా చూసింది.
17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ, పరుగుల వరద పారిస్తున్న విరాట్.. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. మరెన్నో కొత్త రికార్డులు నెలకొల్పాడు. ఈ సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ సాధించిన భారీ రికార్డులపై ఓ లుక్కేద్దాం.
అన్ని ఫార్మాట్లలో 550 మ్యాచ్‌లు ఆడిన విరాట్... 52.27 సగటున 82 సెంచరీలు, 143 హాఫ్ సెంచరీల సాయంతో 27599 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ (34357), సంగక్కర (28016) తర్వాత మూడో స్థానం
సచిన్ (100) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు
ఒకే దశకంలో 20000 పైచిలుకు పరుగులు చేసిన తొలి ఆటగాడు
సచిన్ (76) తర్వాత అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు (69) అందుకున్న ఆటగాడు
అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు (21) అందుకున్న ఆటగాడు
అత్యధిక ఐసీసీ అవార్డులు (10) అందుకున్న ఆటగాడు
వన్డేల్లో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడు
వన్డేల్లో అత్యంత వేగంగా 8000-14000 పరుగులు చేసిన ఆటగాడు
వన్డే ఛేదనల్లో అత్యధిక సెంచరీలు (24) చేసిన ఆటగాడు
వన్డేల్లో ఓ జట్టుపై (శ్రీలంక) అత్యధిక సెంచరీలు (10)
వన్డేల్లో మూడు దేశాలపై (శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియా) 8కి పైగా సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (39)
టీ20ల్లో అత్యధిక సగటు (48.70) కలిగిన ఆటగాడు
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు (39)
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో నంబర్ వన్‌గా నిలిచిన ఏకైక భారత ఆటగాడు
కెప్టెన్‌గా అత్యధిక (7) డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడు
అత్యంత వేగంగా 25 టెస్ట్ సెంచరీలు చేసిన భారత ఆటగాడు
భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారధి (68 మ్యాచ్‌ల్లో 40 విజయాలు)
గతేడాది టీ20 ఫార్మాట్‌కు.. ఈ ఏడాది టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్, ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.