0.1 పాయింట్‌ తేడాతో స్వర్ణం | Korean teenage shooter sensation | Sakshi
Sakshi News home page

0.1 పాయింట్‌ తేడాతో స్వర్ణం

Jul 30 2024 6:09 AM | Updated on Jul 30 2024 6:09 AM

Korean teenage shooter sensation

కొరియా టీనేజ్‌ షూటర్‌ సంచలనం  

పారిస్‌ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన టీనేజ్‌ షూటర్‌ బాన్‌ హ్యోజిన్‌ 0.1 పాయింట్‌ తేడాతో స్వర్ణం కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళల విభాగం ఫైనల్లో 16 ఏళ్ల బాన్‌ హ్యోజిన్‌ చివరి షాట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి పతకం చేజిక్కించుకుంది. 22 షాట్లు ముగిసేసరికి బాన్‌ హ్యోజిన్‌తో పాటు 17 ఏళ్ల చైనా షూటర్‌ హువాంగ్‌ యూటింగ్‌ 251.8 పాయింట్లతో నిలిచారు. 

దీంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్‌ ఆఫ్‌’ నిర్వహించగా.. అందులో బాన్‌ 10.4 స్కోరు చేయగా.. హువాంగ్‌ 10.3 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. తద్వారా బాన్‌ ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలిచిన అతిపిన్న వయసు మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. స్విట్జర్లాండ్‌ షూటర్‌ ఆడ్రే గొగ్నియాల్‌ 230.3 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement