తీరు మారని టీమిండియా.. ఆసీస్ చేతిలో మరో ఓటమి | Konstas guides Australia A to six-wicket win over India A in second unofficial Test | Sakshi
Sakshi News home page

IND-A vs AUS-A: తీరు మారని టీమిండియా.. ఆసీస్ చేతిలో మరో ఓటమి

Nov 9 2024 1:23 PM | Updated on Nov 9 2024 1:31 PM

Konstas guides Australia A to six-wicket win over India A in second unofficial Test

ఆస్ట్రేలియా గడ్డపై భారత-ఎ జట్టుకు ఘోర పరభావం ఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్‌ల​ టెస్టు సిరీస్‌లో 2-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ అయింది.

168 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలుత ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను శామ్ కాన్‌స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ (25) ఆదుకున్నారు.

ఆ తర్వాత మెక్‌స్వీనీ ఔటైనప్పటకీ శామ్ కాన్‌స్టాస్(73), వెబ్‌స్టార్(46) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా, కొటియన్ ఒక్క వికెట్ సాధించారు.

మరోసారి ధృవ్‌.. 
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 229 పరుగులకు ఆలౌటైంది. 75/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత-ఎ జట్టు అదనంగా 154 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. 

మరోసారి వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 122 బంతులు ఎదుర్కొన్న జురెల్ 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. అతడితో పాటు తనీష్ కొటియన్‌(44), నితీష్ కుమార్ రెడ్డి(38) పరుగులతో రాణించారు.

కాగా తొలి ఇన్నింగ్స్‌లో కూడా ధృవ్ (80) ఒంటరిపోరాటం చేశాడు. టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌ వైఫల్యం కారణంగానే ఈ సిరీస్‌ను టీమిండియా కోల్పోయింది. ధ్రువ్‌ జురెల్‌తో పాటు భారత-ఎ జట్టుతో చేరిన మరో సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తీవ్ర నిరాశపరిచాడు.
చదవండి: IND vs SA: సంజూతో గొడ‌వ ప‌డ్డ సౌతాఫ్రికా ప్లేయ‌ర్‌.. ఇచ్చిప‌డేసిన‌ సూర్య‌! వీడియో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement