
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఎదురులేని అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ
సింగపూర్: ఒకటి కాదు...రెండు కాదు... మూడు కాదు... నాలుగు కాదు... వరుసగా ఏడోసారి కేటీ లెడెకీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్‌లో తనకు తిరుగులేదని అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ నిరూపించుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 7వసారి లెడెకీ చాంపియన్‌గా నిలిచింది. 28 ఏళ్ల లెడెకీ 800 మీటర్ల విభాగంలో 7వసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
శనివారం హోరాహోరీగా సాగిన 800 మీటర్ల ఫైనల్ రేసును లెడెకీ 8 నిమిషాల 05.62 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్వర్ణంపై గురి పెట్టిన సమ్మర్ మెకింటోష్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మెకింటోష్ 8 నిమిషాల 07.29 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. లానీ పాలిస్టర్ (ఆస్ట్రేలియా; 8 నిమిషాల 05.98 సెకన్లు) రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
700 మీటర్లు ముగిశాక మెకింటోష్ 0.14 సెకన్ల ఆధిక్యంలో ఉండగా... చివరి 100 మీటర్లలో లెడెకీ జోరు పెంచడంతో చివరకు మెకింటోష్ మూడో స్థానంతో, లానీ పాలిస్టర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది.
16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న లెడెకీ... 2015లో, 2017లో, 2019లో, 2022లో, 2023లోనే బంగారు పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో లెడెకీ 23 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా లెడెకీ 44 ప్రపంచ, ఒలింపిక్ పతకాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
మిక్స్‌డ్ రిలేలో ప్రపంచ రికార్డు
మరోవైపు మిక్స్‌డ్ ఫ్రీస్టయిల్ 4్ఠ100 రిలేలో జాక్ అలెక్సీ, ప్యాట్రిక్ సామన్, కేట్ డగ్లస్, టోరి హుస్కీలతో కూడిన అమెరికా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 18.48 సెకన్లలో రేసును ముగించి 2023లో 3 నిమిషాల 18.83 సెకన్లతో ఆ్రస్టేలియా బృందం నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో గ్రెట్‌చెన్ వాల్‡్ష (అమెరికా; 24.83 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ కామెరాన్ మెక్‌ఇవోయ్ (ఆ్రస్టేలియా; 21.14 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో డిఫెండింగ్ చాంపియన్ కేలీ మెక్‌కియోవన్ (ఆ్రస్టేలియా; 2ని:03.33 సెకన్లు) విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు. నేటితో ముగియనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం అమెరికా 8 స్వర్ణాలు, 11 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో నంబర్‌వన్ స్థానంలో ఉంది.