breaking news
World Swimming Championship
-
కిన్ డబుల్ ధమాకా..
సింగపూర్: ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ ఆరో రోజు స్టార్ స్విమ్మర్లు లాన్ మర్చెండ్ (ఫ్రాన్స్), టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ (కెనడా) బరిలో లేకపోవడంతో... ఐదు వేర్వేరు దేశాలకు చెందిన స్విమ్మర్లు పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం పోటీల్లో నెదర్లాండ్స్, చైనా, హంగేరి, అమెరికా, ఇంగ్లండ్‌కు చెందిన స్విమ్మర్లు స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో మ్యారిట్ స్టీన్బెర్గన్ (నెదర్లాండ్స్) పసిడి పతకంతో మెరిసింది. ఫైనల్ రేసులో స్టీన్బెర్గన్ 52.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. మొల్లీ ఓ కల్లాఘన్ (52.67 సెకన్లు; ఆ్రస్టేలియా), టారీ హుస్కే (52.89 సెకన్లు; అమెరికా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. 2024లో దోహా వేదికగా జరిగిన పోటీల్లో సైతం విజేతగా నిలిచిన స్టీన్బెర్గన్... చివరి 50 మీటర్లలో జోరు పెంచి చాంపియన్‌గా అవతరించింది. ఆ్రస్టేలియా, అమెరికా స్విమ్మర్ల నుంచి కఠిన పోటీ ఎదురైనా... ఆఖర్లో ఆధిక్యం కనబర్చింది. ‘దోహాలో సునాయాసంగా విజయం సాధించా. కానీ ఈ సారి పోటీ చాలా తీవ్రంగా ఉంది. అందుకే ఈ విజయం చాలా సంతృప్తినిచి్చంది’ అని పోటీ అనంతరం స్టీన్బెర్గన్ పేర్కొంది. ఆరో రోజు పోటీలు ముగిసేసరికి అమెరికా, ఆ్రస్టేలియా ఐదేసి స్వర్ణ పతకాలతో పట్టిక అగ్రస్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా అమెరికా 20 పతకాలు సాధించగా... ఆ్రస్టేలియా 13 పతకాలు ఖాతాలో వేసుకుంది. కిన్ విన్ పురుషుల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో చైనా స్విమ్మర్ కిన్ హైయాంగ్ విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో కిన్ 2 నిమిషాల 7.41 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పీ వటనబె (2 నిమిషాల 7.70 సెకన్లు; జపాన్) రజతం గెలుచుకోగా... కాస్పర్ కారŠూబ్య (2 నిమిషాల 7.73 సెకన్లు; నెదర్లాండ్స్) కాంస్య పతకం నెగ్గాడు. ఈ విభాగంలో రెండేళ్ల క్రితం ప్రపంచ రికార్డు (2 నిమిషాల 5.48 సెకన్లు) తనపేరిట రాసుకున్న కిన్... విజయం అనంతరం ‘ఇదో అద్భుతం’ అని వ్యాఖ్యానించాడు. 100 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్లోనూ పసిడి నెగ్గిన కిన్... 200 మీటర్లలోనూ జోరు కనబర్చి డబుల్ ధమాకా మోగించాడు. పురుషుల 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ హబర్ట్ (హంగేరి) పసిడి పతకం గెలిచాడు. 1 నిమిషం 53.19 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పీటర్ కోట్జీ (1 నిమిషం 53.36 సెకన్లు; దక్షిణాఫ్రికా), యోహాన్ బ్రౌర్డ్ (1 నిమిషం 54.62 సెకన్లు; ఫ్రాన్స్) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. స్టార్ స్విమ్మర్ కేట్ డగ్లస్... అమెరికాకు ఐదో స్వర్ణం అందించింది. మహిళల 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో 2 నిమిషాల 18.50 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఇది రెండో అత్యుత్తమ టైమింగ్ కావడం విశేషం. చికునోవా (2 నిమిషాల 19.96 సెకన్లు) రజతం గెలుచుకోగా.. కైలెన్ కార్బెట్, అలీనా ముసుకా (2 నిమిషాల 23.52 సెకన్లు) ఒకే సమయంలో లక్ష్యాన్ని చేరి కాంస్యం దక్కించుకున్నారు. పురుషుల 4–200 ఫ్రీస్టయిల్ రిలేలో బ్రిటన్ జట్టు 6 నిమిషాల 59.84 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం పసిడి గెలుచుకుంది. చైనా (7 నిమిషాల 0.91 సెకన్లు), ఆ్రస్టేలియా (7 నిమిషాల 0.98 సెకన్లు) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నాయి. చైనాకు చెందిన 12 ఏళ్ల స్విమ్మర్ యూ జిడి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సత్తాచాటింది. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే విభాగంలో చైనా జట్టులో సభ్యురాలైన యూ జిడి కాంస్యం గెలుచుకుంది. ఆ్రస్టేలియా, అమెరికా బృందాలు వరుసగా స్వర్ణ, రజతాలు నెగ్గారు. 200 మీటర్ల బటర్‌ఫ్లై, 200 మీటర్ల మెడ్లీ వ్యక్తిగత విభాగాల్లోనూ యూ జిడి పతకానికి దగ్గరగా వచ్చింది. నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకానికి దూరమైంది. 400 మీటర్ల విభాగం యూ జిడి ఇంకా పోటీ పడాల్సి ఉంది. ఈ టోర్నీలో భారత స్విమ్మర్ల నిరాశజనక ప్రదర్శన ఆరో రోజు కూడా కొనసాగింది. పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో రోహిత్ 47వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
మెకింటోష్ పసిడి ‘హ్యాట్రిక్’
సింగపూర్: ఈత కొలనులో తనకు తిరుగులేదని కెనడా టీనేజ్ స్టార్ స్విమ్మర్ సమ్మర్ మెకింటోష్ మరోసారి చాటుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తన జోరు కొనసాగిస్తూ 18 ఏళ్ల మెకింటోష్ మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఫైనల్లో మెకింటోష్ 2 నిమిషాల 01.99 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఇప్పటికే మెకింటోష్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్, 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ విభాగాల్లో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్‌లో మెకింటోష్ బరిలోకి దిగాల్సి ఉంది. ఈ రెండింటిలోనూ మెకింటోష్ స్వర్ణాలు సాధిస్తే... ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అత్యధికంగా 5 స్వర్ణ పతకాలు సాధించిన స్విమ్మర్‌గా మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా; 2007లో) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మెకింటోష్ సమం చేస్తుంది. గత ఏడాది జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మెకింటోష్ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్, మెడ్లీ, 400 మీటర్ల మెడ్లీ ఈవెంట్స్‌లో స్వర్ణాలు గెలిచి, 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో రజతం సాధించింది. 2022 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గిన మెకింటోష్ ... 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు సాధించింది. మూడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న మెకింటోష్ ఇప్పటి వరకు మొత్తం ఏడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో కలిపి 11 పతకాలు గెలిచింది. మరోవైపు పురుషుల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో ఫేవరెట్ లియోన్ మర్చండ్ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం సెమీఫైనల్ రేసులో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పిన 23 ఏళ్ల మర్చండ్... గురువారం జరిగిన ఫైనల్ రేసును 1 నిమిషం 53.68 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో డేవిడ్ పొపోవిచి (రొమేనియా; 46.51 సెకన్లు)... మహిళల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కేథరీన్ బెర్కోఫ్ (అమెరికా; 27.08 సెకన్లు) బంగారు పతకాలు గెలిచారు. మహిళల 4–200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో ఆస్ట్రేలియా బృందం స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. మరో మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ మెగా ఈవెంట్లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా (5 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 11 పతకాలతో అగ్రస్థానంలో... అమెరికా (4 స్వర్ణాలు, 10 రజతాలు, 4 కాంస్యాలు) 18 పతకాలతో రెండో స్థానంలో... కెనడా (3 స్వర్ణాలు, 2 కాంస్యాలు) ఐదు పతకాలతో మూడో స్థానంలో ఉన్నాయి. గెలిచిన స్వర్ణాల సంఖ్య ఆధారంగా ర్యాంకింగ్‌ను నిర్ణయిస్తారు. -
చరిత్ర సృష్టించిన కేటీ.. మైఖేల్ ఫెల్ప్స్ రికార్డు బద్ధలు
26 ఏళ్ల అమెరికా మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ చరిత్ర సృష్టించింది. జపాన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 16 స్వర్ణ పతాకాలు సాధించి, ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో వరల్డ్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రికార్డు దిగ్గజ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ (15) పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో కేటీ.. ఫెల్ప్స్ రికార్డు బద్దలు కొట్టి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇవాళ (జులై 30) జరిగిన 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఫైనల్లో స్వర్ణం గెలవడం ద్వారా లెడెకీ ఈ ఘనత సాధించింది. 800 మీటర్ల ఈవెంట్లో స్వర్ణం కైవసం చేసుకున్న లెడెకీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. వరల్డ్ ఛాంపియన్షిప్ మహిళల 800 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్స్‌లో అత్యధిక స్వర్ణ పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే ఒకే ఈవెంట్లో అత్యధిక ప్రపంచ ఛాంపియన్షిప్స్ బంగారు పతకాలు (6) సాధించిన స్విమ్మర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో 1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లోనూ స్వర్ణంతో మెరిసిన కేటీ.. ఇప్పటివరకు తన కెరీర్లో 20 వరల్డ్ ఛాంపియన్షిప్స్ స్వర్ణాలు, 7 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది. మహిళల స్విమ్మింగ్ చరిత్రలో ఏ సిమ్మర్ కేటీ సాధించినన్ని గోల్డ్ మెడల్స్ సాధించలేదు. -
ఒకే ఈవెంట్లో 3 ప్రపంచ రికార్డులు
కజాన్ (రష్యా) : ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డుల జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మిక్స్డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలేలో మూడు కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఉదయం జరిగిన రెండో హీట్‌లో రష్యా బృందం 3ని:45.87 సెకన్లతో రేసును ముగించి... 2014 జనవరిలో 3ని:46.52 సెకన్లతో ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఆ వెంటనే మూడో హీట్‌లో రియాన్ మర్ఫీ, కెవిన్ కార్డెస్, కెండిల్ స్టీవార్ట్, లియా నీల్లతో కూడిన అమెరికా బృందం 3ని:42.33 సెకన్లలో గమ్యానికి చేరుకొని కొన్ని నిమిషాలముందు రష్యా సాధించిన ప్రపంచ రికార్డును సవరించింది. సాయంత్రం జరిగిన మిక్స్డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలే ఫైనల్లో క్రిస్ వాకర్, ఆడమ్ పీటీ, మేరీ ఒకానర్, ఫ్రాన్ హల్సల్లతో కూడిన బ్రిటన్ జట్టు 3ని:41.71 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని కొత్త ప్రపంచ రికార్డు లిఖిండంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
లెడెకి ప్రపంచ రికార్డు
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ కజాన్ (రష్యా): ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్ రేసును 18 ఏళ్ల లెడెకి 15ని: 27.71 సెకన్లలో ముగించింది. తద్వారా గతేడాది పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో 15ని:28.35 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. 1500 మీటర్ల విభాగంలో లెడెకిది నాలుగో ప్రపం చ రికార్డు కావడం విశేషం. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 15ని:36.53 సెకన్లతో తొలి ప్రపంచ రికార్డును సృష్టించిన లెడెకి... ఆ తర్వాత వుడ్లాండ్స్ మీట్లో (15ని:34.23 సెకన్లు), పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో మరో రెండుసార్లు ప్రపంచ రికార్డును సవరించింది. 400, 800 మీటర్ల విభాగాల్లోనూ లెడెకి పేరిటే ప్రపంచ రికార్డులు ఉండటం విశేషం.