లెడెకి ప్రపంచ రికార్డు | World record to Katie lede | Sakshi
Sakshi News home page

లెడెకి ప్రపంచ రికార్డు

Aug 4 2015 1:38 AM | Updated on Sep 3 2017 6:43 AM

లెడెకి ప్రపంచ రికార్డు

లెడెకి ప్రపంచ రికార్డు

ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది...

ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్
కజాన్ (రష్యా):
ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్ రేసును 18 ఏళ్ల లెడెకి 15ని: 27.71 సెకన్లలో ముగించింది. తద్వారా గతేడాది పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో 15ని:28.35 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. 1500 మీటర్ల విభాగంలో లెడెకిది నాలుగో ప్రపం చ రికార్డు కావడం విశేషం. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 15ని:36.53 సెకన్లతో తొలి ప్రపంచ రికార్డును సృష్టించిన లెడెకి... ఆ తర్వాత వుడ్‌లాండ్స్ మీట్‌లో (15ని:34.23 సెకన్లు), పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో మరో రెండుసార్లు ప్రపంచ రికార్డును సవరించింది. 400, 800 మీటర్ల విభాగాల్లోనూ లెడెకి పేరిటే ప్రపంచ రికార్డులు ఉండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement