breaking news
free style
-
మార్పు... మంచి కోసమే!
చెస్... అందరికీ సుపరిచతమైన ఆట... ఏదో ఒకదశలో ఒక్కసారైనా ఆడిన వాళ్లు ఎందరో ఉన్నారు. అంతర్జాతీయంగానూ ఈ క్రీడకు ఎంతో పేరుంది. కానీ ఒలింపిక్స్‌లో మాత్రం చెస్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఆ దిశగా అడుగులు వేయాలంటే ముందుగా ఆట అందరికీ మరింత చేరువయ్యేలా చేయాలి. ఒకప్పుడు క్లాసికల్ ఫార్మాట్లోనే ఎక్కువగా చెస్ టోర్నీలు జరిగేవి. కాలక్రమేనా చెస్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. నార్వే దిగ్గజం, వరల్డ్ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్సన్ ఈ విషయంలో ఎంతో చొరవ తీసుకుంటున్నాడు. గ్రాండ్చెస్ టూర్... ఫ్రీస్టయిల్ చెస్... సూపర్‌బెట్ చెస్... ఇలా మేటి గ్రాండ్మాస్టర్లను భాగస్వామ్యం చేస్తూ నిలకడగా టోర్నీలు నిర్వహిస్తున్నాడు. ఈ తరహా మార్పులతో చెస్‌కు మరింత ఆదరణ పెరుగుతోందని... ఈ ఆట కొత్త శిఖరాలకు చేరుకోవడానికి దోహదం పడుతుందనిప్రపంచ ఆరో ర్యాంకర్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అభిప్రాయపడుతున్నాడు. నేటి నుంచి జరగనున్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న అర్జున్ గత ఫలితాల గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్తాతని తెలిపాడు. చెన్నై: అంతర్జాతీయస్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న భారత స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేశి స్వదేశంలో మెగా టోర్నీకి సిద్ధమయ్యాడు. గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడనున్నారు. భారత్ నుంచి అర్జున్‌తో పాటు, విదిత్ గుజరాతీ, నిహాల్ సరీన్, కార్తికేయన్ మురళి, ప్రణవ్ బరిలో ఉన్నారు. ఇటీవల నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అర్జున్... ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్‌తో పాటు ఇ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. స్వదేశంలో జరగనున్న చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా అర్జున్ అడుగులు వేస్తున్నాడు. టోర్నీ ఆరంభానికి ముందు అర్జున్ మాట్లాడుతూ... ‘ఎక్కువగా ఆలోచించడం లేదు. ప్రత్యర్థి ఎవరైనా సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకుంటా. క్లాసికల్ టోర్నమెంట్లో ప్లేయర్లు దీర్ఘాలోచనలో మునిగిపోతారు. దీంతో అభిమానులు విసుగు చెందుతారు. కానీ ఇ–స్పోర్ట్స్‌లో అలా జరగదు. వెంట వెంటనే ఎత్తులకు పైఎత్తులు వేయాల్సిన అవసరముంటుంది. అందుకే అభిమానులు ఈ తరహా ఆటలను ఆదరిస్తారు. సమయం అనేది చాలా కీలకం అవుతుంది. ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. దీంతో చూసేవాళ్లకు బాగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఆటగాళ్లు, అభిమానులు దీని వైపే మొగ్గుచూపడం ఖాయమే’ అని అన్నాడు. క్యాండిడేట్స్ టోర్నీపై దృష్టి ఇక తాజాగా ఇ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఓటమి పాలవడం బాధించిందని వరంగల్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల అర్జున్ అన్నాడు. ‘ఇ–స్పోర్ట్స్ వరల్డ్‌కప్’లో సెమీఫైనల్‌కు చేరడం ఆనందంగానే ఉంది. కానీ ఆశించిన ఫలితం రాలేదనే అసంతృప్తి ఉంది. ఆఖరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యాను. ఇలాంటి చేదు అనుభవాల నుంచి బయటపడి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నా’ అని అర్జున్ వెల్లడించాడు. లాస్‌వేగస్‌లో జరిగిన గ్రాండ్‌స్లామ్ టోర్నీ చివరి మూడు మ్యాచ్‌ల్లోనూ అర్జున్ ఓటమి పాలయ్యాడు. ఫ్రీస్టయిల్ ఆడటం చాలా బాగుంటుందన్న అర్జున్... భవిష్యత్తులో గ్రాండ్‌స్లామ్‌కు టూర్ చెస్ క్యాలెండర్లో తప్పక చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ప్రపంచ ఆరో ర్యాంక్‌లో ఉన్న అర్జున్... అన్ని ఫార్మాట్లలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. వచ్చే ఏడాది జరగనున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుండగా... 8 మంది ప్లేయర్లు టైటిల్ కోసం పోటీపడనున్నారు. ఇప్పటికే అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా ఈ టోర్నీకి అర్హత సాధించగా... మిగిలిన ఏడు స్థానాల కోసం ప్లేయర్లు పోటీపడుతున్నారు. ముఖ్యంగి వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన వారిలో ముగ్గురు, గ్రాండ్ స్విస్ టూర్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఇద్దరు. ‘ఫిడే సర్క్యూట్’ నుంచి ఒకరు క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించనున్నారు. ఈ నేపథ్యంలో అర్జున్ మాట్లాడుతూ... ‘క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాలంటే నా ముందు రెండే దారులు ఉన్నాయి. గ్రాండ్‌స్విస్, వరల్డ్‌కప్ అ రెండింట్లో మెరుగైన ఆటతీరు కనబర్చాలని భావిస్తున్నా. రెండిట్లో కనీసం ఒక్క టోర్నీలో అయినా టైటిల్ సాధించాలి. రేటింగ్‌లో టాప్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంటున్న 10 మంది ప్లేయర్లలో... అర్జున్ అత్యధిక రేటింగ్ (2,776 పాయింట్లు) కలిగి ఉన్నాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్ గ్రాండ్‌మాస్టర్ అనీశ్ గిరి (2748 పాయింట్లు) రెండో... స్థానంలో విన్సెంట్ కీమర్ (2730 పాయింట్లు; జర్మనీ) మూడో స్థానంలో ఉన్నారు. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరగనున్న ఈ టోర్నీలో 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. గత రెండు ఎడిషన్లలో అర్జున్ త్రుటిలో టైటిల్‌కు దూరమయ్యాడు. 2023లో గుకేశ్‌తో టైబ్రేకర్‌లో ఓడి రెండో స్థానానికి పరిమితం కాగా... గతేడాది కూడా టైటిల్ గెలవలేకపోయాడు. ‘గత రెండు పర్యాయాలు ఇక్కడ టైటిల్ గెలవకపోవడంతో నాపై ఎలాంటి అంచనాలు లేవు. అదే సమయంలో ఒత్తడి కూడా ఉండదు. దీంతో ప్రదర్శనపై మరింత దృష్టి పెడతా’ అని అర్జున్ అన్నాడు. అగ్ని ప్రమాదంతో...నేడు మొదలయ్యే ‘చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2025’ టోర్నమెంట్లో అర్జున్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. వాస్తవానికి ఈ టోర్నీ బుధవారమే ప్రారంభం కావాలి. కానీ టోర్నీ వేదికైన హయాత్ రీజెన్సీ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్‌తో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొగ కమ్ముకోవడంతో హోటల్ సిబ్బంది అందరినీ బయటకు పంపించారు. టోర్నీ నిర్వాహకులు ఈ టోర్నీలో ఆడుతున్న 20 మంది క్రీడాకారులను వెంటనే సమీపంలో మరో హోటల్లో బస ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రానికల్లా అంతా సర్దుకోవడంతో గురువారం నుంచి ఈ టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ టోర్నీలో 11వ తేదీన విశ్రాంతి దినం కేటాయించారు. అయితే ఒకరోజు వృథా కావడంతో విశ్రాంతి దినం తొలగించి... వరుసగా తొమ్మిది రోజులపాటు టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. -
800 మీటర్లలో సప్త స్వర్ణం
సింగపూర్: ఒకటి కాదు...రెండు కాదు... మూడు కాదు... నాలుగు కాదు... వరుసగా ఏడోసారి కేటీ లెడెకీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లాంగ్ డిస్టెన్స్ స్విమ్మింగ్‌లో తనకు తిరుగులేదని అమెరికా మహిళా స్టార్ స్విమ్మర్ నిరూపించుకుంది. ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో 7వసారి లెడెకీ చాంపియన్‌గా నిలిచింది. 28 ఏళ్ల లెడెకీ 800 మీటర్ల విభాగంలో 7వసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం హోరాహోరీగా సాగిన 800 మీటర్ల ఫైనల్ రేసును లెడెకీ 8 నిమిషాల 05.62 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్వర్ణంపై గురి పెట్టిన సమ్మర్ మెకింటోష్ కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మెకింటోష్ 8 నిమిషాల 07.29 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. లానీ పాలిస్టర్ (ఆస్ట్రేలియా; 8 నిమిషాల 05.98 సెకన్లు) రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 700 మీటర్లు ముగిశాక మెకింటోష్ 0.14 సెకన్ల ఆధిక్యంలో ఉండగా... చివరి 100 మీటర్లలో లెడెకీ జోరు పెంచడంతో చివరకు మెకింటోష్ మూడో స్థానంతో, లానీ పాలిస్టర్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తొలిసారి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న లెడెకీ... 2015లో, 2017లో, 2019లో, 2022లో, 2023లోనే బంగారు పతకాలు సొంతం చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో లెడెకీ 23 స్వర్ణాలు, 6 రజతాలు, 1 కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో 9 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా లెడెకీ 44 ప్రపంచ, ఒలింపిక్ పతకాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.మిక్స్డ్ రిలేలో ప్రపంచ రికార్డుమరోవైపు మిక్స్డ్ ఫ్రీస్టయిల్ 4్ఠ100 రిలేలో జాక్ అలెక్సీ, ప్యాట్రిక్ సామన్, కేట్ డగ్లస్, టోరి హుస్కీలతో కూడిన అమెరికా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని హస్తగతం చేసుకుంది. అమెరికా బృందం 3 నిమిషాల 18.48 సెకన్లలో రేసును ముగించి 2023లో 3 నిమిషాల 18.83 సెకన్లతో ఆ్రస్టేలియా బృందం నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్ విభాగంలో గ్రెట్చెన్ వాల్‡్ష (అమెరికా; 24.83 సెకన్లు) బంగారు పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో పారిస్ ఒలింపిక్స్ చాంపియన్ కామెరాన్ మెక్ఇవోయ్ (ఆ్రస్టేలియా; 21.14 సెకన్లు) స్వర్ణ పతకాన్ని సాధించాడు. 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో డిఫెండింగ్ చాంపియన్ కేలీ మెక్కియోవన్ (ఆ్రస్టేలియా; 2ని:03.33 సెకన్లు) విజేతగా నిలిచి టైటిల్ నిలబెట్టుకున్నాడు. నేటితో ముగియనున్న ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం అమెరికా 8 స్వర్ణాలు, 11 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 26 పతకాలతో నంబర్‌వన్ స్థానంలో ఉంది. -
గుకేశ్‌కు చివరి స్థానం
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి రౌండ్‌ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయాడు. -
కాంస్యం నెగ్గిన వ్రితి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో తెలంగాణకు రెండో పతకం లభించింది. గచి్చ»ౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో సోమవారం మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వ్రితి అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించింది. వ్రితి 18ని:09.50 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఆదివారం మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ వ్రితికి కాంస్య పతకం దక్కింది. మహిళల 200 మీటర్ల మెడ్లే విభాగంలో హషిక రామచంద్ర (కర్ణాటక) కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. హషిక 2ని:21.15 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలువడంతోపాటు 2010 నుంచి రిచా మిశ్రా (2ని:23.62 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఆర్యన్ నెహ్రా (గుజరాత్; 8ని:01.81 సెకన్లు), మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో అనన్య నాయక్ (మహారాష్ట్ర; 57.31 సెకన్లు) కూడా స్వర్ణ పతకాలు సాధించడంతోపాటు కొత్త జాతీయ రికార్డులు సృష్టించారు. -
National Games 2022: వ్రిత్తి ఖాతాలో మరో పతకం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల స్విమ్మింగ్ 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రిత్తి అగర్వాల్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఈ విభాగంలో వ్రిత్తి 4 నిమిషాల 34.96 సెకన్లలో గమ్యానికి చేరి మూడో స్థానంలో నిలిచింది. ఈ జాతీయ క్రీడల్లో వ్రిత్తికిది మూడో పతకం కావడం విశేషం. ఇప్పటి వరకు తెలంగాణ ఏడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 18 పతకాలతో 14వ స్థానంలో ఉంది. -
స్విమ్మింగ్‌లో చైనా సంచలనం.. ప్రపంచ రికార్డు బద్దలు
టోక్యో: ఒలింపిక్స్ మహిళల స్విమ్మింగ్ 4*200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే ఈవెంట్లో చైనా స్విమ్మర్లు బోణీ కొట్టారు. ప్రపంచ రికార్డుతో పసిడి పతకం గెలుపొందారు. జున్జువాన్, ముహన్ టంగ్, యుఫె జంగ్, లి బింగ్జీలతో కూడిన చైనా బృందం విజేతగా నిలిచింది. చైనా స్విమ్మర్లు 7ని:40.33 సెకన్లలో పోటీని పూర్తి చేశారు. ఈ క్రమంలో చైనా బృందం 2019లో ఆస్ట్రేలియా జట్టు 7ని:41.50 సెకన్లతో నెలకొల్పిన ప్రపంచ రికార్డును... 2012 లండన్ ఒలింపిక్స్‌లో అమెరికా జట్టు 7ని:42.92 సెకన్లతో సాధించిన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ విభాగంలో చైనా 2004, 2008 విశ్వ క్రీడల్లో రజతాలే గెలిచింది. అమెరికాకు చెందిన అలీసన్ స్మిత్, పేజ్ మాడిన్, క్యాథరిన్, లెడెకీల బృందం (7ని: 40.73 సెకన్లు) రజతం గెలుపొందగా... టిట్మస్, ఎమా, మాడిసన్, లీ నియల్ లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు (7ని: 41.29 సెకన్లు) కాంస్య పతకం నెగ్గింది. అమెరికా, ఆస్ట్రేలియా జట్లు కూడా కొత్త ఒలింపిక్ రికార్డులు నమోదు చేయడం విశేషం. -
కెమెరాను 'గే'లిచారు..
-
కెమెరాను 'గే'లిచారు..
సియోల్: దక్షిణాకొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో అమెరికాకు చెందిన ఫ్రీస్టైల్ స్కైయెర్ గస్ కెన్‌వర్తీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. ఆదివారం స్లోప్స్టైయిల్ ఈవెంట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన కెన్‌వర్తీ..తన బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దు ఇస్తూ కెమెరాను మాత్రం 'గే' లిచాడు. సాధారణంగా ఎవరైనా అత్యుత్తమ ప్రదర్శన చేసిన తర్వాత మాత్రమే ఎక్కువ దృష్టి సారించే కెమెరాలు..కెన్‌వర్తీ 12వ స్థానంలో నిలిచినా మొత్తం అతన్నే టార్గెట్ చేశాయి. అందుకు కారణం అతని బాయ్‌ఫ్రెండ్‌ను ముద్దు పెట్టుకోవడమే. ఎవరికైనా ప్రేమ అనేది ప్రేమే కాబట్టి ఈ జోడి ఒకరినొకరు అభినందించుకునే క్రమంలో చుట్టూ ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయారు. అంతే కెమెరాలన్నీ ఒక్కసారిగా వీరి వైపు తిరిగాయి. తమ కెమెరాల్లో బంధిస్తూ ఏదో అద్భుతం జరుగుతుదేమో అనేంతంగా పోటీ పడి క్లిక్‌లు మీద క్లిక్‌లు కొట్టాయి. ఆపై ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కెన్‌వర్తీ వెలుగులోకి వచ్చాడు. దీనిపై సోమవారం ట్వీట్ చేసిన కెన్‌వర్తీ..' ఈ మూమెంట్‌ను కెమెరాలో బంధిస్తారని అనుకోలేదు. ఈ రకంగా మా గురించి ప్రపంచానికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నతనంలో ఎప్పుడూ గే కిస్‌ను టీవీల్లో చూడలేదు. ఇదే తొలిసారి కావొచ్చు. ఒక పిల్లాడు ఇంట్లో కూర్చొని మా ప్రేమను చూసే అవకాశం కల్పించారు' అని కెన్‌వర్తీ సంతోషం వ్యక్తం చేశాడు. -
50 మీ. ఫ్రీస్టయిల్ విజేత నిర్విఘ్న
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన వేసవి శిబిరాల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో నిర్విఘ్న 50 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో విజేతగా నిలిచాడు. సరూర్‌నగర్ స్టేడియంలోని స్విమ్మింగ్‌పూల్‌లో ఆదివారం జరిగిన అండర్–10 బాలుర ఫైనల్లో అతడు 40.95 సెకన్లలో లక్ష్యాన్ని చేరి టైటిల్ సాధించాడు. కాశీ 42.95 సెకన్లు, ఆదిత్య పట్వారీ 43.39 సెకన్లలో లక్ష్యం చేరి వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అండర్–14 బాలుర ఫ్రీస్టయిల్ విభాగంలో ధృవ 18.45 సెకన్లలో లక్ష్యం చేరి టైటిల్ గెలిచాడు. వరుణ్ (20.20 సెకన్లు) యశ్వంత్ (24.26 సెకన్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ అనిత దయాకర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇతర విభాగాల విజేతల వివరాలు: అండర్–10 ఫ్రీస్టయిల్ 25 మీటర్లు: బాలురు: 1.అమిత్ లాల్ (21.16 సెకన్లు), 2.డి.కోనేరు (21.68 సెకన్లు), 3.ఒమర్ అబ్దుల్లా (22.16 సెకన్లు); బాలికలు: 1.క్రాంతి గుప్తా (19.63 సెకన్లు), 2.ఖుషి (22.76 సెకన్లు), 3.సుదీక్ష (24.81 సెకన్లు). అండర్–12 ఫ్రీస్టయిల్ 25 మీటర్లు: బాలురు: 1.అద్వైత్ (23.92 సెకన్లు), 2.వంశీ (27.26 సెకన్లు), 3.అభినవ్ (28.58 సెకన్లు); బాలికలు: 1.లాలిత్య (23.15 సెకన్లు), 2.ప్రణతి, 3.అను.