
ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌లో లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ నియమితుడయ్యాడు. కేన్ డాన్ లారెన్స్ నుంచి ఈ బాధ్యతలను చేజిక్కించుకున్నాడు. కేన్ హండ్రెడ్ లీగ్‌లో ఆడటం ఇదే మొదటిసారి. హండ్రెడ్ 2025 రేపటి నుంచి (ఆగస్ట్ 5) ప్రారంభం కానుంది.
లండన్ స్పిరిట్ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్‌తో తలపడనుంది. లండన్ స్పిరిట్‌లో కేన్‌తో పాటు డేవిడ్ వార్నర్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, ఆస్టన టర్నర్, జేమీ స్మిత్, ఓలీ పోప్, రిచర్డ్ గ్లీసన్, లూక్ వుడ్, ఓల్లీ స్టోన్ లాంటి అంతర్జాతీయ ప్లేయర్లు ఉన్నారు.
కాగా, ఈ సీజన్ మొత్తం ఇంగ్లండ్‌లోనే గడపనున్న కేన్ విలియమ్సన్.. టీ20 బ్లాస్ట్, కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నీల్లో మిడిల్‌సెక్స్ జట్టుకు ఆడతాడు. కేన్ మామ మిడిల్‌సెక్స్ తరఫున కూడా ఇటీవలే అరంగేట్రం చేసి ఈ సీజన్‌లోనే రెండు సెంచరీలు బాదాడు.
కేన్ గతకొంతకాలంగా న్యూజిలాండ్ జట్టు దూరంగా ఉన్నాడు. మిడిల్‌సెక్స్, లండన్ స్పిరిట్‌తో ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా జాతీయ జట్టుకు అందుబాటులో లేడు. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటస్తుంది. ఈ పర్యటనలో కోసం ఎంపిక చేసిన జట్టు నుంచి కేన్ స్వచ్చందంగా తప్పుకున్నాడు.
ఈ ఏడాది ప్రారంభంలో కేన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరస్కరించాడు. ప్రైవేట్ లీగ్‌లకు అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు.