
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ తమ దేశానికే చెందిన దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను ఓ విషయంలో అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో (ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ల్లో) ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డొనాల్డ్‌ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు.
ఈ జాబితాలో షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్న్ సౌతాఫ్రికాపై 69 మ్యాచ్‌ల్లో 190 వికెట్లు తీశాడు. వార్న్ తర్వాత టాప్-5 స్థానాల్లో డేల్ స్టెయిన్ (ఆసీస్‌పై 49 మ్యాచ్‌ల్లో 127 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాత్ (సౌతాఫ్రికాపై 58 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు), రబాడ (38 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు), డొనాల్డ్ (44 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు) ఉన్నారు.
రబాడ ఈ ఘనతను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రబాడతో పాటు క్వేనా మపాకా (4-0-20-4) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది.
టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.
అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది.