ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం | Jyothi Surekha-led Indian women compound team wins gold medal | Sakshi
Sakshi News home page

ఆర్చరీలో సురేఖ బృందానికి స్వర్ణం

Apr 12 2026 1:39 PM | Updated on Apr 12 2026 1:49 PM

Jyothi Surekha-led Indian women compound team wins gold medal

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నమెంట్‌ మహిళల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత జట్టుకు స్వర్ణ పతకం లభించింది. సీనియర్‌ స్టార్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ, మధుర, ప్రగతిలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 233–232 (59–58, 55–59, 59–57, 60–58) పాయింట్ల తేడాతో అలెక్సిస్‌ రుయిజ్, పియర్స్, ఒలివియా డీన్‌లతో కూడిన అమెరికా జట్టును ఓడించింది. 

ఓవరాల్‌గా సురేఖ కెరీర్‌లో ఇది 12వ ప్రపంచకప్‌ పసిడి పతకం కావడం విశేషం. తొలి రౌండ్‌ నుంచే భారత్‌, అమెరికా ఢీ అంటే ఢీ అన్నట్ల పోటీపడ్డాయి. తొలి రౌండ్‌లో భారత్‌ 59-58తో అమెరికాపై స్వల్ప ఆధిక్యం ప్రదర్శించగా, రెండో రౌండ్‌లో ఆధిక్యం 114-117 తగ్గింది. 

అయితే మూడో రౌండ్‌ ముగిసే సరికి 173-174తో స్వల్ప వెనుకంజలో ఉన్న భారత్‌ చివర్లో ఆరు పది పాయింట్లు ఖాతాలో వేసుకోవడంతో పసిడి ఖాతాలో చేరింది.

చదవండి: అథ్లెటిక్స్‌లో సంచలనం.. బోల్ట్ రికార్డు బ‌ద్ద‌లు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement