న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ పోరాడుతోంది. 463 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (75 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంగ్లండ్ విజయానికి మరో 281 పరుగులు అవసరం కాగా.. న్యూజిలాండ్ విజయానికి మరో 5 వికెట్లు అవసరం. ఇప్పటికైతే గెలుపు అవకాశాలు న్యూజిలాండ్ వైపే ఉన్నప్పటికీ ఇంగ్లండ్ విజయం సాధిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే.
ప్రస్తుతం జోర్డాన్ కాక్స్ (0) క్రీజులో ఉన్నాడు. కివీస్ బౌలర్లలో కైల్ జేమీసన్ 3 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు హ్యారీ బ్రూక్ (58) అర్ధసెంచరీతో రాణించాడు. రూట్, బ్రూక్ కలిసి నాలుగో వికెట్‌కు 97 పరుగులు జోడించారు. వీరిద్దరు ఉన్నంతసేపు మ్యాచ్ ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపినప్పటికీ బ్రూక్ వెనుదిరగడం, ఆ వెంటనే వికెట్ కీపర్ జేమ్స్ రూ కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది.
ఇక గెలుపు సంగతి పక్కనబెడితే కాక్స్ మినహా మిగతా అంతా టెయిలెండర్లే కావడంతో రూట్ చివరి వరకు నిలిస్తేనే ఇంగ్లండ్ కనీసం మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 362 పరుగులకు ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ 121 పరుగులు చేసి ఔటవ్వగా, డారిల్ మిచెల్ (68), నాథన్ స్మిత్ (38) రాణించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, మాథ్యూ ఫిషర్ చెరో 3 వికెట్లు తీయగా, జోష్ టంగ్ 2 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో కివీస్ 115 పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
Read: నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!


