టీమిండియాతో టీ20 సిరీస్‌.. ఐర్లాండ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌ | Ireland T20I Squad Vs India Announced; Lorcan Tucker Named New Captain | Sakshi
Sakshi News home page

టీమిండియాతో టీ20 సిరీస్‌.. ఐర్లాండ్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

Jun 23 2026 11:47 AM | Updated on Jun 23 2026 12:00 PM

Ireland T20I Squad Vs India Announced; Lorcan Tucker Named New Captain

టీమిండియాతో సొంత‌గ‌డ్డ‌పై జ‌ర‌గ‌బోయే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 14 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా క్రికెట్ ఐర్లాండ్ సెల‌క్ష‌న్ క‌మిటీ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. తమ టీ20 జ‌ట్టు కొత్త కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్‌ను సెల‌క్ట‌ర్లు నియ‌మించారు.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ఐర్లాండ్‌ ఘోర వైఫ‌ల్యానికి నైతిక బాధ్య‌త వ‌హిస్తూ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ నుంచి  స్టార్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ త‌ప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే జ‌ట్టు ప‌గ్గాల‌ను ట‌క్క‌ర్‌కు అప్ప‌గించారు. ఇక భార‌త్‌తో సిరీస్‌కు పాల్ స్టిర్లింగ్, జోష్ లిటిల్, మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, బారీ మెక్‌కార్తీ వంటి స్టార్ ప్లేయ‌ర్లు గాయాల కార‌ణంగా దూర‌మ‌య్యారు. 

దీంతో ముగ్గురు యువ ఆట‌గాళ్లు తొలిసారి ఐరీష్ జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కింది. మాథ్యూ హాలార్డ్, జై మూంద్రా, రూబెన్ విల్సన్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిరీస్ 26 నుంచి బెల్‌ఫాస్ట్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్రక‌టించింది. శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో భారత్ బ‌రిలోకి దిగ‌నుంది. ఈ సిరీస్ నుంచి ఇండియా స్టార్ ప్లేయ‌ర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి గాయాల కార‌ణంగా త‌ప్పుకున్నారు.

టీమిండియాతో టీ20ల‌కు ఐర్లాండ్ జ‌ట్టు
లోర్కాన్ టక్కర్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డోక్రెల్, స్టీఫెన్ డోహెని, మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్, మాథ్యూ హాలార్డ్, లియామ్ మెక్‌కార్తీ, జై మూంద్రా, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, రూబెన్ విల్సన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement