IPL: కేకేఆర్‌ మెంటార్‌గా రాహుల్‌ ద్రవిడ్‌..? | IPL: KKR Approaches Rahul Dravid For The Mentor's Post | Sakshi
Sakshi News home page

IPL: కేకేఆర్‌ మెంటార్‌గా రాహుల్‌ ద్రవిడ్‌..?

Jul 9 2024 1:36 PM | Updated on Jul 9 2024 1:40 PM

IPL: KKR Approaches Rahul Dravid For The Mentor's Post

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో ఐపీఎల్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొత్త మెంటార్‌ అన్వేషణలో పడింది. తమ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాలని కేకేఆర్‌ టీమిండియా తాజా మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను కోరినట్లు తెలుస్తుంది. ఇందుకు ద్రవిడ్‌ సైతం సుముఖ​త వ్యక్తం చేశాడని సమాచారం. ఒకవేళ ఈ డీల్‌ కుదిరితే ద్రవిడ్‌ వచ్చే సీజన్‌ (2025) నుంచి కేకేఆర్‌ మెంటార్‌గా వ్యవహరిస్తాడు.

మరోవైపు టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ పేరు అధికారికంగా ప్రకటించడమే తరువాయి. హెడ్‌ కోచ్‌ పదవి విషయంలో గంభీర్‌-బీసీసీఐ మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం​. గంభీర్‌ తన సహాయ సిబ్బందిని ఎంచుకునే విషయంలోనూ బీసీసీఐ పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తుంది. గంభీర్‌ సక్సెస్‌ఫుల్‌ బ్యాటర్‌ కావడంతో తనే బ్యాటింగ్‌ కోచ్‌గా కూడా వ్యవహరించే అవకాశం ఉంది. గంభీర్‌ తనకు ఇష్టం వచ్చిన వారికి బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లుగా ఎంచుకోవచ్చు.

టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ రేసులో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, దిగ్గజ ఫీల్డర్‌ జాంటీ రోడ్స్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బౌలింగ్‌ కోచ్‌గా ఎవరుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా గంభీర్‌ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గంభీర్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపడితే కేకేఆర్‌ మెంటార్షిప్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ద్రవిడ్‌ కేకేఆర్‌ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కాగా, టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం టీ20 వరల్డ్‌కప్‌ 2024తో ముగిసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement