
ఐపీఎల్-2025 సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు లభిస్తే మే 15 లేదా 16వ తేదీన ఐపీఎల్ తిరిగి మొదలయ్యే అవకాశముంది. మంగళవారం (మే 13) నాటికి ఆటగాళ్లందరినీ జట్టుతో చేరేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఫైనల్ వేదికను మార్చాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
ఇప్పుడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఫైనల్ వేదికను మార్చనున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ తేదీలో కూడా మార్పు చోటు చేసుకోనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. మే 25 బదులుగా మే 30న తుది పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఐపీఎల్-2025ను బీసీసీఐ వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన మ్యాచ్‌లకు విదేశీ ఆటగాళ్ల అందుబాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. చాలా మంది ఫారన్ ప్లేయర్లు ఇప్పటికే తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.
చదవండి: IND vs SL: ముక్కోణపు వన్డే సిరీస్ విజేతగా భారత్.. ఫైనల్లో శ్రీలంక చిత్తు