IPL 2024 LSG vs PBKS: బోణీ కొట్టిన లక్నో.. పంజాబ్‌పై విజయం | IPL 2024: Lucknow Super Giants vs Punjab Kings Live Score Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2024 LSG vs PBKS Live updates: బోణీ కొట్టిన లక్నో.. పంజాబ్‌పై విజయం

Mar 30 2024 7:06 PM | Updated on Mar 30 2024 11:26 PM

IPL 2024: Lucknow Super Giants vs Punjab Kings Live Score Updates And Highlights - Sakshi

LSG vs PBKS match Live Updates:

పంజాబ్‌పై లక్నో విజయం
ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. లక్నో వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌(70) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లక్నో బౌలర్లలో యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌ 3 వికెట్లతో అదరగొట్టగా.. మోహ్షిన్‌ ఖాన్‌ రెండు వికెట్లు సాధించారు.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో డికాక్‌(54) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. పూర‌న్‌(42), కృనాల్‌ పాండ్యా(43) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో సామ్ కుర్రాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, రబాడ‌, రాహుల్ చాహ‌ర్ త‌లా వికెట్ సాధించారు.

ఐదో వికెట్‌ డౌన్‌.. కుర్రాన్‌ ఔట్‌
17 ఓవర్ వేసిన మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ‍ధావన్‌(70) ఔట్ కాగా.. సామ్ కుర్రాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. 17 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌ 144/5.

మూడో వికెట్‌ డౌన్‌..
139 పరుగుల వద్ద పంజాబ్‌ కింగ్స్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 6 పరుగులు చేసిన జితేష్‌ శర్మ.. మయాంక్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో వికెట్‌ డౌన్‌.. సిమ్రాన్‌ సింగ్‌ ఔట్‌
128 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన ఫ్రభు సిమ్రాన్ సింగ్‌..  మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు పంజాబ్ స్కోర్‌ :129/4. క్రీజులో శిఖర్‌ ధావన్‌(67), జితేష్‌ శర్మ(1) ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్‌.. బెయిర్ స్టో ఔట్‌
102 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 42 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
10 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 98/0
10 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్‌(56), జానీ బెయిర్ స్టో(42) పరుగులతో ఉన్నారు.
దంచికొడుతున్న పంజాబ్‌ ఓపెనర్లు..
6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్‌(41), జానీ బెయిర్ స్టో(19) పరుగులతో ఉన్నారు.

2 ఓవర్లకు పంజాబ్‌ స్కోర్‌: 16/0
2 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్‌(7), జానీ బెయిర్ స్టో(9) పరుగులతో ఉన్నారు.

రాణించిన ల‌క్నో బ్యాట‌ర్లు.. పంజాబ్ టార్గెట్ 200 ప‌రుగులు
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో డికాక్‌(54) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. పూర‌న్‌(42), కృనాల్‌ పాండ్యా(43) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో సామ్ కుర్రాన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అర్ష్‌దీప్ సింగ్ రెండు, రబాడ‌, రాహుల్ చాహ‌ర్ త‌లా వికెట్ సాధించారు.

ఐదో వికెట్ డౌన్‌.. పూర‌న్ ఔట్‌
పూర‌న్ రూపంలో ల‌క్నో ఐదో వికెట్ కోల్పోయింది. 42 ప‌రుగులు చేసిన పూర‌న్‌.. రబాడ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 17 ఓవర్లకు లక్నో స్కోర్‌: 160/5. క్రీజులో బ‌దోని(6), కృనాల్‌ పాండ్యా(13)
 ప‌రుగుల‌తో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ల‌క్నో.. డికాక్‌ ఔట్‌
క్వింట‌న్‌ డికాక్‌ రూపంలో ల‌క్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 54 ప‌రుగులు చేసిన డికాక్‌.. అర్ష‌దీప్ సింగ్ బ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 14 ఓవర్లకు లక్నో స్కోర్‌: 136/4. క్రీజులో పూర‌న్‌(33), బ‌దోని(2) ప‌రుగుల‌తో ఉన్నారు.

13 ఓవర్లకు లక్నో స్కోర్‌: 113/3
13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి లక్నో 3 వికెట్ల న‌ష్టానికి ల‌క్నో 113 ప‌రుగులు చేసింది. క్రీజులో డికాక్‌(47), పూర‌న్‌(24) ప‌రుగుల‌తో ఉన్నారు.

మూడో వికెట్ కోల్పోయిన ల‌క్నో.. ప‌డిక్క‌ల్‌ ఔట్‌
మార్క‌స్ స్టోయినిష్‌ రూపంలో ల‌క్నో మూడో వికెట్ కోల్పోయింది. 19 ప‌రుగులు చేసిన స్టోయినిష్‌.. రాహుల్ చాహ‌ర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 9 ఓవర్లకు లక్నో స్కోర్‌: 80/3. క్రీజులో డికాక్‌(35), పూర‌న్‌(1) ప‌రుగుల‌తో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన ల‌క్నో.. ప‌డిక్క‌ల్‌ ఔట్‌
దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ రూపంలో ల‌క్నో రెండో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన ప‌డిక్క‌ల్‌.. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 6 ఓవర్లకు లక్నో స్కోర్‌: 54/2. క్రీజులో డికాక్‌(28), స్టోయినిష్‌(1) ప‌రుగుల‌తో ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన ల‌క్నో.. రాహుల్ ఔట్‌
35 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 ప‌రుగులు చేసిన కేఎల్ రాహుల్‌.. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి దేవ్‌ద‌త్త్ ప‌డిక్క‌ల్ వ‌చ్చాడు. 4 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోర్‌: 35/1

2 ఓవర్లకు లక్నో స్కోర్‌: 12/0
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్‌(2), డికాక్‌(9) పరుగులతో ఉన్నారు.

ఐపీఎల్‌-2024లో భాగంగా ల‌క్నో వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌,  ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో ల‌క్నో కెప్టెన్‌గా నికోల‌స్ పూర‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. రెగ్యూల‌ర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలోకి దిగ‌న‌నున్నాడు.

తుది జ‌ట్లు
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), కేఎల్‌ రాహుల్, దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్(కెప్టెన్‌), మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్(కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ(వికెట్ కీప‌ర్‌), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement