ధోనినా మజాకా.. చెవులు చిల్లులు పడేలా చేశాడు.. కోహ్లి కూడా అంతే..! | IPL 2024 DC VS CSK: 128 DB Roars Heard When Dhoni Hits Boundary On First Ball, Highest Peak Roars In This IPL | Sakshi
Sakshi News home page

IPL 2024 DC VS CSK: ధోనినా మజాకా.. చెవులు చిల్లులు పడేలా చేశాడు.. కోహ్లి కూడా అంతే..!

Apr 1 2024 11:04 AM | Updated on Apr 1 2024 12:26 PM

IPL 2024 DC VS CSK: 128 DB Roars Heard When Dhoni Hits Boundary On First Ball, Highest Peak Roars In This IPL - Sakshi

విశాఖ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్‌ మజాను అందించింది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకులు పొట్టి ఫార్మాట్‌లోని పూర్తి మజాను ఆస్వాదించారు. సీఎస్‌కే మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని చాలాకాలం తర్వాత సూపర్‌ మ్యాన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో విశాఖ ప్రేక్షకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది.

ధోని తొలి బంతికే బౌండరీ కొట్టినప్పుడు స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ సమయంలో చెవులు చిల్లులు పడే స్థాయిలో 128 డెసిబుల్స్‌ సౌండ్‌ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో ఇంతటి సౌండ్‌ నమోదు కావడం ఇది రెండోసారి. కొద్దిరోజుల కిందట చిన్నస్వామి స్టేడియంలో విరాట్‌ కోహ్లి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసినప్పుడు కూడా ఇంతే స్థాయిలో (128 డెసిబుల్స్‌) శబ్దాలు నమోదయ్యాయి.

కాగా, విశాఖ మ్యాచ్‌లో ధోని చెలరేగినప్పటికీ సీఎస్‌కే 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని లేటుగా క్రీజ్‌లోకి రావడంతో సీఎస్‌కే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. పృథ్వీ షా (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (35 బంతుల్లో 52; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రిషబ్‌ పంత్‌ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పతిరణ 3 వికెట్లతో రాణించాడు. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. ఖలీల్‌ అహ్మద్‌ (4-1-21-2), ముకేశ్‌ కుమార్‌(3-0-21-3), అక్షర్‌ పటేల్‌ (3-0-20-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు రుతురాజ్‌ (1),రచిన్‌ రవీంద్ర (2), సమీర్‌ రిజ్వి (0) విపలం కాగా.. రహానే (45), డారిల్‌ మిచెల్‌ (34) పర్వాలేదనిపించారు. ఆఖర్లో రవీంద్ర జడేజా (21 నాటౌట్‌), ధోని చెలరేగిప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఇది తొలి ఓటమి కాగా.. ఢిల్లీ బోణీ కొట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement