Shubman Gill-Sachin: 2009లో సచిన్‌.. 2022లో శుబ్‌మన్‌ గిల్‌ మాత్రమే; అరుదైన రికార్డు

IPL 2022: Shubman Gill Equals Sachin Record Without Sixes Played 20 Overs - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లే ఆఫ్‌ చేరిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 62 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకొని 18 పాయింట్లతో దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రషీద్‌ ఖాన్‌ 4 వికెట్లతో లక్నో పతనాన్ని శాసించినప్పటికి.. అంతకముందు బ్యాటింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ విలువైన అర్థసెంచరీ సాధించాడు. గిల్‌ ‌49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులతో చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. కాగా గిల్‌కు ఈ సీజన్‌లో ఇది నాలుగో అర్థసెంచరీ కావడం విశేషం.

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అరుదైన రికార్డును శుబ్‌మన్‌ గిల్‌ అందుకున్నాడు. 2009లో చెన్నై సూపర్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున ఓపెనర్‌గా వచ్చిన సచిన్ టెండూల్కర్... 49 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 20 ఓవర్ల పాటు క్రీజులో బ్యాటింగ్ చేసినా టెండూల్కర్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్స్ కొట్టకుండానే హాఫ్‌ సెంచరీ సాధించాడు.

తాజాగా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా  క్రీజులోకి వచ్చిన గిల్‌ 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 7 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో కూడా సచిన్‌ లాగే ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. ఇక సచిన్ టెండూల్కర్ తర్వా త ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఒక్క సిక్సర్ కూడా కొట్టని రెండో బ్యాట్స్‌మెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు.

ఇక టీ20ల్లో టెస్టు బ్యాటింగ్ చేస్తాడనే అపవాదు గిల్‌పై ఉండేది. అందుకే మెగావేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిటెన్షన్ చేసుకోలేదు. అయితే గుజరాత్‌ టైటాన్స్‌ మాత్రం గిల్‌ ఆటను నమ్మింది. మెగావేలంలో  ఏకంగా రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడే శుబ్‌మన్ గిల్‌కి అంత భారీ మొత్తం ఖర్చు చేయడం అనవసరమని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు . అయితే సీజన్‌లో గిల్ దూకుడైన ఆటతీరు కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు  సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 384 పరుగులు సాధించాడు. ఇక శుబ్‌మన్‌ గిల్‌.. సచిన్‌ టెండూల్కర్‌ కూతురు సారా టెండూల్కర్‌ మధ్య లవ్‌స్టోరీ నడుస్తుందంటూ గాసిప్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: Rashid Khan Wickets In T20: టి20 క్రికెట్‌లో రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత

Venkatesh Iyer: 'అప్పటివరకు బాగానే.. ఇషాన్‌ చెప్పగానే ఔటయ్యాడు'

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top