Rashid Khan Wickets In T20: టి20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత

ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సీజన్‌లో ప్లే ఆఫ్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. గుజరాత్ విజయంలో స్పిన్నర్ రషీద్ ఖాన్ నాలుగు వికెట్లతో కీలకపాత్ర పోషించాడు. రషీద్ దెబ్బకు లక్నో సూపర్ జెయింట్స్ 82 పరుగులకే కుప్పకూలింది.
ఈ నేపథ్యంలోనే రషీద్ ఖాన్ టి20 క్రికెట్‌లో అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఒక ఏడాదిలో టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్ ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానం.. సందీప్ లమిచ్చానే 23 మ్యాచ్‌ల్లో 38 వికెట్లతో రెండు, డ్వేన్ బ్రావో 19 మ్యాచ్‌ల్లో 34 వికెట్లతో మూడు, జాసన్ హోల్డర్ 17 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక రషీద్ లక్నోతో మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరీర్‌లో బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు. లక్నోతో మ్యాచ్‌లో 3.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకముందు 2020 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై(3 వికెట్లు/7 పరుగులు), పంజాబ్ కింగ్స్‌పై(3 వికెట్లు/12 పరుగులు) బెస్ట్ ఫిగర్స్ నమోదు చేశాడు.
చదవండి: Rovman Powell: 'మూడురోజులు టవల్ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు'
Rashid Khan is our Top Performer from the second innings for his excellent bowling figures of 4/24.
A look at his bowling summary here 👇👇 #TATAIPL #LSGvGT pic.twitter.com/2kIQWyQmFY
— IndianPremierLeague (@IPL) May 10, 2022
That 'INTO THE PLAYOFFS' feeling 😁😁
A brilliant team effort tonight and what a way to bounce back! 💪#AavaDe #SeasonOfFirsts #GujaratTitans #TataIPL2022 #IPL pic.twitter.com/sGcRz423Tb
— Rashid Khan (@rashidkhan_19) May 10, 2022
మరిన్ని వార్తలు