Rovman Powell: 'మూడురోజులు టవల్‌ చుట్టుకునే.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు'

Rovman Powell Shares Hilarious Deets Spent 2-3 Days Just-Towel - Sakshi

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పడుతూ లేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు విజయాలు.. ఆరు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. అయితే ఢిల్లీ తాను ఆడబోయే చివరి మూడుమ్యాచ్‌ల్లో గెలిస్తే ప్లేఆఫ్‌ చేరే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఖంగుతిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. 

ఈ విషయం పక్కనబెడితే.. ఢిల్లీ హార్డ్‌ హిట్టర్‌ రోవ్‌మెన్‌ పావెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ 'ఎపిసోడ్‌-6 విత్‌ పావెల్‌' పాడ్‌కాస్ట్‌ ఇంటర్య్వూ నిర్వహించింది. ఇంటర్య్వూలో పావెల్‌ తన అనుభవం గురించి చెప్పుకొచ్చాడు.'' ఐపీఎల్‌ 2022 సీజన్‌ కోసం ముంబైలో అడుగుపెట్టినప్పుడు వింత అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పుడు నా హ్యాండ్‌ బాగ్‌ తప్ప మరెలాంటి బట్టలు లేవు.. అవి ఎక్కడో మిసయ్యాయి. ఆ తర్వాత హోటల్‌ రూంలో మూడురోజుల పాటు టవల్‌ చుట్టుకునే గడిపాను. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.


PC: IPL Twitter
''ఇక ఐపీఎల్‌ కోసం కరిబీయన్‌ నుంచి ఇండియాకు వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ బాగానే రిసీవ్‌ చేసుకుంది. ఢిల్లీతో ఉంటే సొంతజట్టుతో ఉన్నట్లే అనిపిస్తుంది. నేను ఆటగాడిగా రాణించినా.. రాణించకపోయినా జట్టు మద్దతు అనేది ముఖ్యం. ఆ విషయంలో మాత్రం నాకు డోకా లేదు. ఇది మంచి విషయం. రిషబ్‌ పంత్‌ మంచి ఆటగాడు మాత్రమే కాదు.. గుడ్‌ కెప్టెన్‌ కూడా. అంతర్జాతీయ క్రికెట్‌లో పంత్‌కు ప్రత్యర్థిగా ఆడినప్పటికి మంచి స్నేహితులుగానే ఉంటాము. జట్టులో చోటు కల్పించడం.. నా రోల్‌ను సమర్థంగా పోషించేందుకు సాయపడతానని పంత్‌ అన్నాడు. తాజాగా మా కెప్టెన్‌ తన మాటకు కట్టుబడ్డాడు'' అంటూ చెప్పుకొచ్చాడు. 

కాగా ఈ సీజన్‌లో రోవ్‌మెన్‌ పావెల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 11 మ్యాచ్‌లాడిన పావెల్‌ 205 పరుగులు సాధించాడు. పావెల్‌ ఖాతాలో ఒక అర్థసెంచరీ ఉంది.

చదవండి: Shreyas Iyer: 'ఏం చేయాలో తెలియని స్థితి.. చివరకు సీఈవో జోక్యం'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

10-05-2022
May 10, 2022, 13:30 IST
టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బిజీగా ఉన్నారు. ఆఖరి అంకానికి చేరుకున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌ మే...
10-05-2022
May 10, 2022, 12:58 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. లీగ్‌ ప్రారంభమై 15 ఏళ్లు గడుస్తున్నా ఆ జట్టు...
10-05-2022
May 10, 2022, 11:27 IST
IPL 2022 KKR Vs MI- Rohit Sharma Comments: ‘‘మా బౌలింగ్‌ విభాగం రాణించింది. బుమ్రా మరింత ప్రత్యేకం....
10-05-2022
May 10, 2022, 11:18 IST
ఐపీఎల్‌ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్‌ 52 పరుగుల సూపర్‌ విక్టరీ సాధించింది. తద్వారా తమ ప్లే ఆఫ్‌...
10-05-2022
May 10, 2022, 10:25 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏది కలిసిరావడం లేదు. ఘోర ప్రదర్శనతో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు దూరమైన ముంబై...
10-05-2022
May 10, 2022, 09:06 IST
ఐపీఎల్‌ 2022లో ​భాగంగా ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంతి కనిపించకపోవడంతో ఇషాన్‌...
10-05-2022
May 10, 2022, 08:33 IST
ఐపీఎల్‌ 2022లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది....
10-05-2022
May 10, 2022, 08:01 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయం మరోసారి ఒక బ్యాట్స్‌మన్‌ కొంపముంచింది. ఇప్పటికే ఈ సీజన్‌లో థర్డ్‌...
10-05-2022
May 10, 2022, 05:21 IST
ముంబై: తొలి పది మ్యాచ్‌లలో తీసింది 5 వికెట్లే... ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బౌలర్‌...
09-05-2022
May 09, 2022, 23:03 IST
ఐపీఎల్‌-2022లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. ఈ...
09-05-2022
May 09, 2022, 19:33 IST
Suryakumar Yadav ruled out IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌...
09-05-2022
09-05-2022
May 09, 2022, 18:46 IST
Moeen Ali Lauds Devon Conway: హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో సీఎస్‌కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న డెవాన్‌ కాన్వేపై అతని...
09-05-2022
May 09, 2022, 18:27 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘోర పరాజయం పాలైన...
09-05-2022
May 09, 2022, 18:01 IST
టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రదర్శన రోజురోజుకు తీసికట్టుగా మారుతుందన్నది బహిరంగ రహస్యం. ఈ పరుగుల యంత్రం అంతర్జాతీయ...
09-05-2022
May 09, 2022, 16:57 IST
Devon Conway Compared With Mike Hussey: ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్‌...
09-05-2022
May 09, 2022, 16:49 IST
ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ విధ్వంసకర ఆల్‌ రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు...
09-05-2022
May 09, 2022, 15:43 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (మే 9) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బరి నుంచి...
09-05-2022
May 09, 2022, 13:26 IST
కోహ్లిని ఓదార్చిన సంజయ్‌ బంగర్‌.. వీడియో వైరల్‌
09-05-2022
May 09, 2022, 13:04 IST
డెవన్‌ కాన్వే.. సీజన్‌ ఆరంభంలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. ఏప్రిల్‌ మొదటి వారంలో... 

Read also in:
Back to Top