David Warner: సెంచరీ చేయకపోయినా పంతం నెగ్గించుకున్న వార్నర్‌!

IPL 2022: Fans Praise David Warner Takes Sweet Revenge Batting Vs SRH - Sakshi

ఐపీఎల్‌లో ఒక స్టార్‌ ఆటగాడు ఒక జట్టు నుంచి మరొక జట్టుకు మారడం సర్వ సాధారణం. కానీ ఆస్ట్రేలియా స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌ మాత్రం కాస్త ఢిఫెరెంట్‌ అని చెప్పాలి. సరిగ్గా ఏడాది క్రితం ఎస్‌ఆర్‌హెచ్‌లో వార్నర్‌కు చాలా అవమానాలు జరిగాయి. కెప్టెన్సీ పదవి తొలగించడం.. ఆపై జట్టులో చోటు కోల్పోవడం.. ఆఖరికి డ్రింక్స్‌ బాయ్‌గా సేవలందించిన వార్నర్‌ను చూసి సొంత అభిమానులే ఎస్‌ఆర్‌హెచ్‌ వైఖరిని తప్పుబట్టారు. పొమ్మనలేక పొగబెట్టినట్లు ఐపీఎల్‌లో విజేతగా నిలిపిన వ్యక్తిని అవమానకర రీతిలో జట్టు నుంచి బయటకు పంపించారు.

అయితే వార్నర్‌ ఇదంతా పట్టించుకోలేదు. అవకాశం వచ్చినప్పుడు తాను స్పందిస్తానని స్వయంగా పేర్కొన్నాడు. కట్‌చేస్తే.. మెగావేలంలో రూ. 6 కోట్లకు డేవిడ్‌ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది. సీజన్‌లో కాస్త లేటుగా జాయిన్‌ అయినప్పటికి వార్నర్‌ మంచి ఫామ్‌ కనబరిచాడు. లీగ్‌లో మూడు అర్థసెంచరీలు సాధించిన వార్నర్‌.. తాజాగా తన పాత టీమ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో మరోసారి మెరిశాడు.ఆరంభంలో నెమ్మదిగా ఆడిన వార్నర్‌.. ఆ తర్వాత ఒక్కసారిగా గేర్‌ మార్చాడు. సీజన్‌లో సూపర్‌హిట్‌ బౌలింగ్‌తో మెరుస్తున్న ఉమ్రాన్‌ మాలిక్‌ను వార్నర్‌ ఒక ఆట ఆడుకున్నాడు.

ఓవరాల్‌గా 58 బంతుల్లో 92 పరుగులు చేసిన వార్నర్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. సెంచరీ చేసే అవకాశం రాకపోయినప్పటికి వార్నర్‌ ఒక రకంగా తన పంతం నెగ్గించుకున్నాడనే చెప్పాలి. వాస్తవానికి వార్నర్‌ సెంచరీ చేయాలనుకుంటే రోవ్‌మన్‌ పావెల్‌ అవకాశం ఇచ్చేవాడే. కానీ వార్నర్‌ తన సెంచరీ కంటే జట్టు స్కోరు పెంచడమే ముఖ్యమని భావించాడు. . అందుకే పావెల్‌ను చివరి ఓవర్‌ మొత్తం ఆడమని ముందే చెప్పాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ వేసిన ఆఖరి ఓవర్లో రోవ్‌మెన్‌ పావెల్‌ 6,4,4,4 సహా మొత్తం 19 పరుగులు పిండుకున్నాడు.

ఈ నేపథ్యంలో పావెల్‌ బౌండరీ కొట్టిన ప్రతీసారి.. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లవైపు చూస్తూ వార్నర్‌ గట్టిగా అరుస్తూ పావెల్‌ను ఎంకరేజ్‌ చేశాడు. వార్నర్‌ తీరు చూస్తే తనను అవమానించిన ఎస్‌ఆర్‌హెచ్‌కు తనదైన శైలిలో పంచ్‌ ఇచ్చాడు. ఇది చూసిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌.. వార్నర్‌ ప్రత్యర్థి ఆటగాడైనా సరే.. మన వార్నర్‌ అన్న మొత్తానికి పంతం నెగ్గించుకున్నాడంటూ కామెంట్స్‌ చేశారు. 

డేవిడ్‌ వార్నర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top