
న్యూజిలాండ్‌తో (New Zealand) రేపటి నుంచి (అక్టోబర్ 1) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా మిచ్ ఓవెన్ కొట్టిన షాట్ మ్యాక్స్‌వెల్ చేతికి బలంగా తాకింది. స్కాన్‌లో ఫ్రాక్చర్ నిర్ధారణ కావడంతో మ్యాక్సీ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో జోష్ ఫిలిప్ జట్టులోకి వచ్చాడు. మ్యాక్స్‌వెల్‌కు ఇలాంటి గాయాలు కొత్త కాదు. అతని కెరీర్ మొత్తం గాయలమయంగా ఉంది.
కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా రేపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (New Zealand vs Australia) జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. ఇదే వేదికగా 3, 4 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మూడు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం ఉదయం 11:45 నిమిషాలకు ప్రారంభమవుతాయి.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మ్యాట్ కుహ్నెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా
న్యూజిలాండ్: మార్క్ చాప్‌మన్, టిమ్ రాబిన్సన్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, బెన్ సియర్స్, ఐష్ సోధి
చదవండి: ప్రపంచ క్రికెట్‌లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన