India Vs West Indies 2022: Full Schedule Squads, Venue,Check Details In Telugu - Sakshi
Sakshi News home page

India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌.. షెడ్యూల్‌, జట్లు, పూర్తి వివరాలు!

Jul 19 2022 11:12 AM | Updated on Jul 21 2022 3:39 PM

India Vs West Indies 2022: Full Schedule Squads Venue Details Check Here - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- విండీస్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌(PC: BCCI/WI Cricket)

టీమిండియా వెస్టిండీస్‌ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌, ఇతర వివరాలు!

India tour of West Indies, 2022: ఇంగ్లండ్‌ పర్యటన ముగించుకున్న టీమిండియా వెస్టిండీస్‌ టూర్‌తో బిజీ కానుంది. విండీస్‌లో పర్యటనలో భాగంగా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇక టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వన్డే సిరీస్‌కు వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు మాత్రం హిట్‌మ్యాన్‌ రోహిత్‌ అందుబాటులోకి రానున్నాడు. ఇక ఇంగ్లండ్‌ పర్యటనలో భాగమైన భారత జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా విండీస్‌ టూర్‌కు దూరంగా ఉండనున్నారు.

ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌- టీమిండియా పూర్తి షెడ్యూల్‌, మ్యాచ్‌ సమయం, వేదికలు, జట్ల వివరాలు గమనిద్దాం. ఇక ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్‌ టెస్టులో ఓటమి పాలైన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లను 2-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. విండీస్‌ పర్యటనలోనూ ఇదే తరహాలో విజయం సాధించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), రవీంద్ర జడేజా(వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), శార్దూల్‌ ఠాకూర్‌, యజువేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, ఆవేశ్‌ ఖాన్‌, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్‌ హుడా, శ్రేయాస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, రిషబ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్‌ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌.

కాగా ఇటీవలే గాయం నుంచి కోలుకున్న టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. 

భారత్‌తో వన్డేలకు వెస్టిండీస్ జట్టు: 
నికోలస్ పూరన్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, కీసీ కార్టీ, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేష్ మోటీ, కీమో పాల్, రోవ్‌మన్ పావెల్, జేడెన్ సీల్స్

వెస్టిండీస్‌ పర్యటనలో టీమిండియా షెడ్యూల్‌ ఇలా!
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
జూలై 22- మొదటి వన్డే- క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- ట్రినిడాడ్‌
జూలై 24- రెండో వన్డే- క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- ట్రినిడాడ్‌
జూలై 27- మూడో వన్డే-క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- ట్రినిడాడ్‌
►మ్యాచ్‌ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఆరంభం

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
మొదటి టీ20- జూలై 29- బ్రియన్‌ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్‌
రెండో టీ20- ఆగష్టు 1- వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌
మూడో టీ20- ఆగష్టు 2-వార్నర్‌ పార్క్‌, సెయింట్‌ కిట్స్‌
నాలుగో టీ20- ఆగష్టు 6- సెంట్రల్‌ బ్రొవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియం టర్ఫ్‌ గ్రౌండ్‌, ఫ్లోరిడా
ఐదో టీ20- ఆగష్టు 7- సెంట్రల్‌ బ్రొవార్డ్‌ రీజనల్‌ పార్క్‌ స్టేడియం టర్ఫ్‌ గ్రౌండ్‌, ఫ్లోరిడా
►మ్యాచ్‌ సమయం: భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం

చదవండి: Denesh Ramdin: టీమిండియాతో సిరీస్‌.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విండీస్‌ వికెట్‌ కీపర్‌..!
KL Rahul-Jhulan Goswami: గోస్వామి బౌలింగ్‌.. కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్.. వీడియో వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement