సెంచరీతో అదగరొట్టిన టీమిండియా కెప్టెన్‌.. దక్షిణాఫ్రికా చిత్తు | Sakshi
Sakshi News home page

IND vs SA: సెంచరీతో అదగరొట్టిన టీమిండియా కెప్టెన్‌.. దక్షిణాఫ్రికా చిత్తు

Published Sun, Jan 7 2024 12:46 PM

India U-19 beat South afrcia U-19 by 6 wickets  - Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత అండర్‌-19 జట్టు తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. జోహన్స్‌బర్గ్‌ వేదికగా ఆతిథ్య సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ సిరీస్‌లో టీమిండియాకు ఇది వరుసగా నాలుగో విజయం. ఈ గెలుపుతో  భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రోటీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్టోల్క్‌(69) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో ముషీర్‌ ఖాన్‌ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు నమాన్‌ తివారీ 3 వికెట్లు, అభిషేక్‌, మురగన్‌ తలా వికెట్‌ సాధించారు.

అనంతరం 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌..  48.4 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా కెప్టెన్‌ ఉదయ్‌ సహ్రాన్‌(112) సెంచరీతో చెలరేగగా.. ప్రియాన్షు మౌలియా(76) పరుగులతో రాణించాడు. ఇక జనవరి 10న జరగనున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా లేదా అఫ్గానిస్తాన్‌ జట్టుతో టీమిండియా తలపడనుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement