
భారత అండర్-19 జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయిన ఇంగ్లండ్ యువ జట్టు.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. భారత్-ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల యూత్ టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో మొదటి టెస్టు కోసం తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా వార్విక్‌షైర్‌కు చెందిన హంజా షేక్ ఎంపికయ్యాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో ఇంగ్లండ్ జట్టును హంజా షేక్ లీడ్ చేశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్‌కు దూరంగా ఉన్న షేక్.. తిరిగి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు.
ఇక అతడి డిప్యూటీగా తంజీమ్ అలీ వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఇంగ్లండ్ దిగ్గజాలు ఆండ్రూ ఫ్లింటాఫ్, మైఖేల్ వాన్ కుమారులు రాకీ ఫ్లింటాఫ్, ఆర్చీ వాన్ చోటు దక్కించుకున్నారు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాకీ ఫ్లింటాఫ్ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక సెంచరీ, అర్ధ సెంచరీతో సహా 222 పరుగులు చేశాడు.
దీంతో టెస్టు జట్టులో కూడా అతడి స్దానాన్ని పదిలం చేసుకున్నాడు. డర్హామ్ ఎడమచేతి వాటం పేసర్ జేమ్స్ మింటోకు కూడా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఈ 15 మంది సభ్యుల జట్టులో భారత సంతతికి చెందిన ఆర్యన్ సావంత్, ఎక్ష్ సింగ్, జై సింగ్‌లకు చోటు దక్కింది. ఇక ఈసిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.
భారత అండర్-19 జట్టు
ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్, ఆర్ ఎస్ అంబ్రిష్, సింగ్‌క్ చౌహాన్, హెనిల్ పటేల్, యుధాజిత్ మోల్ రాఘవ్, ప్రణమ్‌జెత్ గుహ, ప్రణమ్‌జెత్ గుహ, డి. దీపేష్, నమన్ పుష్పక్
ఇంగ్లండ్ అండర్-19 జట్టు
హంజా షేక్ (వార్విక్‌షైర్ - కెప్టెన్), తజీమ్ అలీ (వార్విక్‌షైర్), జయద్న్ డెన్లీ (కెంట్), రాకీ ఫ్లింటాఫ్ (లాంకాషైర్), అలెక్స్ ఫ్రెంచ్ (సర్రే), అలెక్స్ గ్రీన్ (లీసెస్టర్‌షైర్), జాక్ హోమ్ (వర్సెస్టర్‌షైర్), బెన్ మాయెస్ (హాంప్‌షైర్), సెబాస్టియన్ మోర్గాన్ (హాంప్‌షైర్), జేమ్స్ మింటో (డర్హామ్), థామస్ రెవ్ (సోమర్‌సెట్), ఆర్యన్ సావంత్ (మిడిల్‌సెక్స్), ఏకాంష్ సింగ్ (కెంట్), జయ్ సింగ్ (యార్క్‌షైర్), ఆర్చీ వాన్ (సోమర్‌సెట్)
చదవండి: ‘ఒక్క మ్యాచ్‌కే తప్పిస్తారా?.. అతడి కోసం నితీశ్ రెడ్డి త్యాగం చేయాల్సింది’