సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను సమం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2026 ఫైనలిస్ట్‌లైన న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 22న క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ వేదికగా తొలి టీ20 జరగనుంది.
ఇప్పటికే కివీస్ గడ్డపై అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టీ20లో బరిలోకి దిగే భారత తుది జట్టును అంచనా వేద్దాం.
ఓపెనర్లుగా అభిషేక్, సంజూ
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలనే టీమ్ మేనేజ్‌మెంట్ కొనసాగించనుంది. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఈ విషయాన్ని ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ధ్రువీకరించాడు. ఇక మూడో స్థానంలో ఎప్పటిలాగే ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌కు రానున్నాడు.
మిడిలార్డర్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, నమన్ ధీర్‌లు తమ తమ స్థానాల్లో కొనసాగనున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ల కోటాలో శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డిలకు చోటు దక్కే అవకాశముంది. ఒకవేళ వీరిద్దరినీ ఆడిస్తే ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు విశ్రాంతినివ్వవచ్చు.
అదేవిధంగా గాయం కారణంగా విండిస్‌తో సిరీస్‌కు దూరమైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిరిగి పునరాగమనం చేయనున్నాడు. అతడికి తోడుగా నమన్ ధీర్ పార్ట్-టైమ్ స్పిన్నర్‌గా సేవలు అందించనున్నాడు.
భువీ రీఎంట్రీ
దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. అతడితో పాటు అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్‌లు బంతిని పంచుకోనున్నారు.
కివీస్‌తో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా): సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
చదవండి: IND vs NZ: పాపం వైభవ్ సూర్యవంశీ..! తేల్చి చెప్పిన టీమిండియా కెప్టెన్


