బ్రెజిల్‌ 4 భారత్‌ 0 | India lost to Brazil in their second friendly match | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ 4 భారత్‌ 0

Oct 4 2026 4:15 AM | Updated on Oct 4 2026 4:15 AM

India lost to Brazil in their second friendly match

కోల్‌కతా: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ బ్రెజిల్‌తో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడి ఓడింది. శనివారం సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో జరిగిన పోరులో భారత జట్టు 0–4 గోల్స్‌ తేడాతో బ్రెజిల్‌ చేతిలో పరాజయం పాలైంది. 50 వేల మందికి పైగా ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో భారత జట్టు పోరాటం ఫర్వాలేదనిపించింది. 

తొలి 25 నిమిషాల పాటు ప్రత్యర్థిని గోల్‌ చేయకుండా అడ్డుకోవడంలో మన డిఫెన్స్‌ సఫలమైంది. బ్రెజిల్‌ తరఫున సామ్యూల్‌ లినో (58వ, 90+5వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... ఎస్టెవో (28వ నిమిషంలో), పెడ్రో (42వ ని.లో) చెరో గోల్‌ కొట్టారు. ఇటీవల పనామాతో మ్యాచ్‌లో 1–1తో ఆకట్టుకున్న భారత ఆటగాళ్లు బ్రెజిల్‌పై ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయారు. దీంతో బ్రెజిల్‌ ప్లేయర్లు తమ అత్యుత్తమ ఆటతీరు కనబర్చాల్సిన అవసరం లేకుండానే మ్యాచ్‌ను గెలిచారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement