చైనా చేతిలో భారత్‌ ఓటమి 

India defeat at the hands of China - Sakshi

షా ఆలమ్‌ (మలేసియా): ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా చైనాతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్‌ 6–21, 21–18, 21–19తో వెంగ్‌ హంగ్‌ యంగ్‌పై గెలిచాడు. రెండో మ్యాచ్‌లో అర్జున్‌–ధ్రువ్‌ కపిల జోడీ 15–21, 21–19, 19–21తో చెన్‌ బొ యంగ్‌–లియు యి చేతిలో ఓడింది.

మూడో మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ 21–11, 21–16తో లీ లాన్‌పై నెగ్గాడు. నాలుగో మ్యాచ్‌లో సూరజ్‌–పృథ్వీ జంట 13–21, 9–21తో జియాంగ్‌ యు–జి హావో ద్వయం చేతిలో ఓడింది. ఐదో మ్యాచ్‌లో చిరాగ్‌ సేన్‌ 15–21, 16–21తో వాంగ్‌ జెంగ్‌ జింగ్‌ చేతిలో ఓడిపోవడంతో భారత్‌ 2–3తో పరాజయం చవిచూసింది.

మహిళల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో హాంకాంగ్‌తో భారత్‌; పురుషుల విభాగం క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌ తో భారత్‌ ఆడతాయి. గెలిచిన జట్లకు కనీసం    కాంస్య పతకాలు ఖాయమవుతాయి. 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top