చెలరేగిన ఉతప్ప.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఇండియా | WCL 2024: India Champions Beat England Champions By 3 Wickets, Check Full Score Details Inside | Sakshi
Sakshi News home page

WCL 2024 IND Vs ENG: చెలరేగిన ఉతప్ప.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఇండియా

Jul 3 2024 9:31 PM | Updated on Jul 4 2024 10:59 AM

India Champions Beat by 3 Wickets england Champions

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో భారత్‌ గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 7 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. 

ఇండియా బ్యాటర్లలో రాబిన్‌ ఉతప్ప(32 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. గుర్‌క్రీత్‌ సింగ్‌(33), నమన్‌ ఓజా(25) పరుగులతో రాణించారు. కాగా కెప్టెన్‌ యువరాజ్‌ సింగ్‌ మాత్రం నిరాశపరిచాడు. 

బౌలింగ్‌లో ఒక ఓవర్‌ వేసి 14 పరుగులిచ్చిన యువీ.. బ్యాటింగ్‌లోనూ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ​ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలోక్రిస్ స్కోఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా.. రవి బపోరా రెండు వికెట్లు సాధించాడు.

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ ఛాంపియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో ఇయాన్‌ బెల్‌(59), సమిత్‌ పటేల్‌(51) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో హార్భజన్‌ సింగ్‌ రెండు, కులకర్ణి, ఆర్పీ సింగ్‌ తలా వికెట్‌ పడగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement