
ఇంగ్లండ్ పర్యటనను టీమిండియాతో ఓటమితో ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(149) భారీ శతకంతో చెలరేగగా.. జాక్ క్రాలీ(65), జో రూట్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఓ వికెట్ సాధించాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు.
అంతకుతోడు చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియా కొంపముంచింది. రెండో ఇన్నింగ్స్‌లు కలపి ఏడు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు విడిచిపెట్టారు. అందులో నాలుగు క్యాచ్‌లు జైశ్వాల్ జారవిడిచినవే కావడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
టెస్టు క్రికెట్ హిస్టరీలోనే..
ఇక ఈ ఓటమితో భారత్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 141 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ చెత్త ఫీట్‌ను నమోదు చేయలేదు.
తాజా ఓటమితో టీమిండియా ఈ ఘోర ఆప్రతిష్టతను మూట కట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్- తొలి టెస్టు సంక్షిప్త సమాచారం
🏏షెడ్యూల్: జూన్ 20- 24
🏏వేదిక: హెడింగ్లీ, లీడ్స్
🏏టీమిండియా తొలి ఇన్నింగ్స్: 471 ఆలౌట్
🏏ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465 ఆలౌట్
🏏తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం
🏏టీమిండియా రెండో ఇన్నింగ్స్: 364 ఆలౌట్
🏏ఇంగ్లండ్ లక్ష్యం: 371
🏏ఆఖరిదైన ఐదో రోజు ఆటలో భాగంగా 373 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించిన స్టోక్స్ బృందం
🏏ఫలితం: ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం