Ind vs WI 1st Test: Rohit Sharma Became Very Slim, Pics Viral - Sakshi
Sakshi News home page

IND VS WI 1st Test: బాగా సన్నబడ్డ రోహిత్‌.. వడపావ్‌ ముద్రను చెరిపివేసుకున్న టీమిండియా కెప్టెన్‌

Jul 11 2023 2:55 PM | Updated on Jul 11 2023 3:35 PM

IND VS WI 1st Test: Rohit Sharma Became Very Slim - Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చాలా సన్నబడ్డాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు బాగా వెయిట్‌ లాస్‌ అయ్యాడు. బరువు పెరగడంతో ఫీల్డ్‌లో చురుగ్గా ఉండలేకపోయిన హిట్‌మ్యాన్‌.. ఒబేసిటి కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అమితంగా అభిమానించే వాళ్లు సైతం రోహిత్‌ను పలు సందర్భాల్లో వడాపావ్‌ అని సంబోధించేవారు. ఓవర్‌ వెయిట్‌ కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రోహిత్‌.. ఇటీవలికాలంలో పరుగులు చేసేందుకు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అసలే నిదానంగా, బద్దకంగా కనిపించే రోహిత్‌.. బరువు పెరగడంతో మరింత నెమ్మదించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతని స్థాయి ఇన్నింగ్స్‌ ఆడి చాలాకాలమైంది.

అయితే తాజాగా హిట్‌మ్యాన్‌ వెయిట్‌లాస్‌ కావడం చూస్తుంటే అతను మునుపటి ఫామ్‌ను అందుకుంటాడని నమ్మకం​ కలుగుతుంది. అతను బరువు తగ్గేందుకు చాలా శ్రమించినట్లు కనిపిస్తుంది. కఠినమైన డైట్‌, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్‌పుట్‌ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ ఇంత పలచబడ్డాడని అనక మానరు. అంతలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా కనిపిస్తున్నాడు రోహిత్‌. అతనిలో కాన్ఫిడెన్స్‌ లెవెల్స్‌ కూడా బాగా పెరిగినట్లు కనిపిస్తున్నాయి. మునుపటితో పోలిస్తే చాలా హుషారుగా కనిపిస్తున్నాడు. ఇది చూసిన అతని అభిమానులు.. హిట్‌మ్యాన్‌ ఇదే మెయింటైన్‌ చేయాలని కోరుకుంటున్నారు.

కొత్త టెస్ట్‌ జెర్సీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. పెదవి విరుస్తున్న అభిమానులు
వెస్టిండీస్‌తో సిరీస్‌ ముందు టీమిండియా ఆటగాళ్లు కొత్త టెస్ట్‌ జెర్సీల్లో కనిపించారు. డ్రీమ్‌ ఎలెవెన్‌ టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్‌ దక్కించుకోవడంతో ఆ పేరు ముద్రించిన కొత్త కిట్లలో టీమిండియా ఆటగాళ్లు దర్శనమిచ్చారు. కొత్త జెర్సీలో తీసుకున్న సెల్ఫీని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిన్న సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా అనూహ్య స్పందన వచ్చింది. హిట్‌మ్యాన్‌ ఏంటీ.. గుర్తుపట్టలేనంతగా ఇలా సన్నబడిపోయాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. రోహిత్‌ వెయిట్‌ లాస్‌ అయినట్లు ఈ జెర్సీలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కొత్త జెర్సీ డిజైన్‌పై టీమిండియా అభిమానులు పెదవి విరుస్తున్నారు. జెర్సీ ఛండాలంగా ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు.      

Advertisement
 
Advertisement
Advertisement