వాళ్లలో ఒక్కరిని అవుట్‌ చేసినా గెలిచేవాళ్లము: కివీస్‌ కెప్టెన్‌ | IND vs NZ 2nd T20I, If we got 1 more wicket: Santner Comments After Loss | Sakshi
Sakshi News home page

వాళ్లలో ఒక్కరిని అవుట్‌ చేసినా గెలిచేవాళ్లము: కివీస్‌ కెప్టెన్‌

Oct 24 2026 7:02 PM | Updated on Oct 24 2026 7:13 PM

IND vs NZ 2nd T20I, If we got 1 more wicket: Santner Comments After Loss

సాంట్నర్‌ (PC: BLACKCAPS)

న్యూజిలాండ్‌కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. సొంతగడ్డపై టీమిండియాతో ఉత్కంఠ పోరులో మరోసారి పరాజయాన్ని చవిచూసింది. తొలి టీ20లో భారీ స్కోరు సాధించినా ఓటమిపాలైన కివీస్‌.. తాజాగా శనివారం నాటి రెండో టీ20లోనూ ఆఖరి వరకు ఆసక్తి రేకెత్తించిన మ్యాచ్‌లోనూ అదే ఫలితం పొందింది.

తిలక్‌, నమన్‌.. రెడ్డి అద్భుతంగా ఆడారు
ఈ నేపథ్యంలో రెండో టీ20లో ఓటమిపై న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ స్పందించాడు. ‘‘మరోసారి ఆఖరి వరకు వచ్చినా మ్యాచ్‌ చేజారింది. పటిష్టమైన జట్టుతో ఆడేటపుడు ఇలాంటి ఉత్కంఠ పోరు సహజమే. తిలక్‌, నమన్‌.. ఆఖర్లో రెడ్డి అద్భుతంగా ఆడారు.

ఈ ముగ్గురిలో ఒక్కరి వికెట్‌నైనా కాస్త ముందుగా తీయగలిగితే కచ్చితంగా అక్కడే మ్యాచ్‌ ముగిసి ఉండేది. కానీ తిలక్‌, రెడ్డి ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారు. చివర్లో మా బౌలర్లు చేసిన తప్పులను సద్వినియోగం చేసుకుని తమ జట్టును గెలిపించుకున్నారు.

కొన్ని తప్పులు చేశాము
స్పిన్నర్లను బరిలోకి దించడం కూడా ప్రభావం చూపింది. పవర్‌ ప్లేలోనే వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ముందుగా కీలక ఆప్షన్లు ఉపయోగించుకున్నాను. అయితే, మధ్య ఓవర్లలో బ్రేస్‌వెల్‌ బాగానే బౌలింగ్‌ చేశాడు. అయితే, ముందుగా చెప్పినట్లు చివరి ఓవర్లలో కొన్ని తప్పులు చేశాము’’ అని సాంట్నర్‌ చెప్పుకొచ్చాడు.  

తిలక్‌ ధనాధన్‌
కాగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా భారత్‌తో శనివారం నాటి రెండో టీ20లో టాస్‌ ఓడిన కివీస్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డ టీమిండియా ఆఖర్లో అద్భుతం చేసి 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ తిలక్‌ వర్మ మెరుపు అర్ధ శతకం (26 బంతుల్లో 51 నాటౌట్‌) సాధించగా.. నమన్‌ ధీర్‌ (17 బంతుల్లో 31), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (13 బంతుల్లో 26 నాటౌట్‌) రాణించి జట్టు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్‌ సారథి సాంట్నర్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌ను గెలిపించారు: శ్రేయస్‌ అయ్యర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement