IND vs IRE: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం | IND vs IRE 2nd T20I Suryansh, Prince Yadav Debut, No Vaibhav Suryavanshi | Sakshi
Sakshi News home page

IND vs IRE: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం

Jun 28 2026 5:42 PM | Updated on Jun 28 2026 7:25 PM

IND vs IRE 2nd T20I Suryansh, Prince Yadav Debut, No Vaibhav Suryavanshi

PC: BCCI

ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా భారత యువ ఆటగాడు సూర్యాంశ్‌ షెడ్గే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అతడితో పాటు ప్రిన్స్‌ యాదవ్‌ కూడా టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు.

అయితే, సంచలన బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది. ఈ పదిహేనేళ్ల పిల్లాడి అరంగేట్రం వాయిదా పడింది.  కాగా ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున 16 మ్యాచ్‌లలో 776 పరుగులు సాధించాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌. ఫలితంగా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్‌ క్యాప్‌ అందుకుని.. ఏకంగా టీమిండియాలోస్థానం సంపాదించాడు. కానీ అరంగేట్రం కోసం వేచి చూడాల్సి వస్తోంది.

విధ్వంసకర బ్యాటర్‌
ఇక టాస్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. సూర్యాంశ్‌పై ప్రశంసలు కురిపించాడు. అతడొక శక్తిమంతమైన, విధ్వంసకర బ్యాటర్‌ అని ప్రశంసించాడు. ముంబై తరఫున దేశీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడని పేర్కొన్నాడు. ఇటీవల భారత్‌- ‘ఎ’ తరఫునా దుమ్ములేపాడని.. అయితే, టీమిండియా తరఫున ఇదే తొలి మ్యాచ్‌ కాబట్టి ఇప్పుడు అతడిపై ఒత్తిడి పెట్టబోమని తెలిపాడు.

పొట్టి ఫార్మాట్లోనూ
మరోవైపు.. ప్రిన్స్‌ యాదవ్‌ ఇటీవలే సొంతగడ్డపై అఫ్గానిస్తాన్‌తో వన్డేల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌లలో కలిపి మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. తాజాగా ఐర్లాండ్‌తో రెండో టీ20 సందర్భంగా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోనూ ఈ పేస్‌ బౌలర్‌ అడుగుపెట్టాడు.

టీమిండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ రెండో టీ20 తుదిజట్లు
టీమిండియా
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

ఐర్లాండ్‌
టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement