
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఓటమి దిశగా పయనిస్తోంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి భారత జట్టు 82 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆఖరి రోజు ఆట తొలి సెషన్‌లో టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి.
తొలుత ఆర్చర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్(9) క్లీన్ బౌల్డ్ కాగా.. కేఎల్ రాహుల్(39) స్టోక్స్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్.. ఆర్చర్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. 58/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ కేవలం 24 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది.
టీమిండియా విజయానికి ఇంకా 108 పరుగులు కావాలి. క్రీజులో జడేజా(10),నితీశ్ కుమర్ రెడ్డి(1) ఉన్నారు. భారత్ ఆశలన్నీ వీరిద్దరిపైనే ఉన్నాయి. ఒకవేళ ఇద్దరిలో ఎవరు ఔటైనా గిల్ సేనకు ఓటమి తప్పదు.
చదవండి: లార్డ్స్‌లో గెలిచేది మేమే.. లంచ్ తర్వాత విజయ లాంఛనం: వాషీ