Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే

India vs Australia, 4th Test- Virat Kohli: నేటితరం క్రికెటర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రికార్డులు సాధించడంలో.. వాటిని తిరగరాయడంలో తనకు తానే సాటి. ఇప్పటికే తన సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనేక రికార్డులు నెలకొల్పాడు రన్‌మెషీన్.
తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 75వ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా ఈ అరదైన శతకం సాధించాడు. సెంచరీ సెంచరీలకు మూడొంతులు పూర్తిచేసి.. ఇంకొక్క 25 శతకాల దూరంలో నిలిచాడు.
సమకాలీన క్రికెటర్లు కనీసం 50 సెంచరీల మార్కు అందుకోలేక ఆపసోపాలు పడుతున్న వేళ ఈ విధంగా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో కోహ్లికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరంటే ఈ పరుగుల యంత్రం సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
అదొక్కటే మిగిలి ఉంది
ఇక ఇప్పటి వరకు 100 సెంచరీలతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ శతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి అతడిని అనుసరిస్తున్నాడు. ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ 71 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. కాబట్టి సచిన్‌ను అధిగమించడమే మిగిలి ఉంది తప్ప కోహ్లికి ఇప్పట్లో పోటీనిచ్చే వాళ్లు ఎవరూ లేరు!
దీంతో కింగ్ కోహ్లి అభిమానుల సంతోషాలు మిన్నంటుతున్నాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆఖరి మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోవాల్సిన కీలక పరిస్థితిలో కోహ్లి బ్యాట్ ఝులిపించడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
యాక్టివ్ ప్లేయర్లలో సెంచరీల విషయంలో కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నది వీళ్లే!
1. విరాట్ కోహ్లి-75
2. జో రూట్- 45
3. డేవిడ్ వార్నర్- 45
4. రోహిత్‌శర్మ- 43
5. స్టీవ్ స్మిత్-42 .
చదవండి: WTC Final: టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక.. కివీస్ అద్భుతం చేస్తేనే..
WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్!
The Man. The Celebration.
Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9
— BCCI (@BCCI) March 12, 2023
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు