రాణించిన ఉనాద్కట్, జయంత్‌  | Sakshi
Sakshi News home page

రాణించిన ఉనాద్కట్, జయంత్‌ 

Published Fri, Sep 15 2023 1:42 AM

Impressive performance by Jaidev Unadkat and Jayant Yadav - Sakshi

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు జైదేవ్‌ ఉనాద్కట్, జయంత్‌ యాదవ్‌ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. లెస్టర్‌షైర్‌ క్లబ్‌తో జరిగిన డివిజన్‌–2 మ్యాచ్‌లో ససెక్స్‌ జట్టు తరఫున ఆడిన ఉనాద్కట్‌ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు తీశాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఉనాద్కట్‌ 23 పరుగులిచ్చి 3 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ససెక్స్‌ జట్టు 15 పరుగుల తేడాతో గెలిచింది. లాంకషైర్‌తో జరిగిన డివిజన్‌–1 మ్యాచ్‌లో మిడిల్‌సెక్స్‌ జట్టుకు ఆడిన జయంత్‌ యాదవ్‌ 131 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. తొలిసారి కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్న భారత లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (3/63, 2/43) కెంట్‌ తరఫున ఐదు వికెట్లు తీసుకున్నాడు.   

Advertisement
 
Advertisement