
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని జట్టు నుంచి తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కాగా కరేబియన్ పర్యటనలో సంజూ తీవ్ర నిరాశపరిచాడు. వన్డే సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీతో కాస్త పర్వాలేదనపించిన శాంసన్.. టీ20లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.
ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 13 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉండటం గమానార్హం. ఈ నేపథ్యంలో జట్టు మెన్‌జ్‌మెంట్‌ను ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ కీలక వాఖ్యలు చేశాడు. శాంసన్‌ను లోయార్డర్‌లో బ్యాటింగ్ పంపడాన్ని అభిషేక్ నాయర్ తప్పుబట్టాడు. కాగా సాధారణంగా ఐపీఎల్‌లో సంజూ 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు.
"సంజూ శాంసన్‌ని సేవలను ఉపయోగించుకోవాలనుకుంటే అతడికి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వండి. అతడు ఆ బ్యాటింగ్ పొజిషన్‌కు బాగా అలవాటు పడ్డాడు. అతడు ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు కూడా. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎటాక్ చేసే సత్తా సంజూకు ఉంది. ఆ స్ధానంలో అతడిని పంపకపోతే పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వవద్దు. సంజూని ఐదు లేదా ఆరో స్ధానంలో ఆడించాలనుకుంటే, అతడికి బదలుగా రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వండని జియో సినిమాతో నాయర్ అన్నాడు.
చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. !