వారి వ‌ల్లే ఈ విజ‌యం.. చాలా సంతోషంగా ఉంది: ఆర్సీబీ కెప్టెన్‌ | "I Get My Confidence From My Bowlers...": Captain Rajat Patidar Comments On RCB Victory Against RR | Sakshi
Sakshi News home page

Rajat Patidar: వారి వ‌ల్లే ఈ విజ‌యం.. చాలా సంతోషంగా ఉంది

Apr 13 2025 9:58 PM | Updated on Apr 14 2025 10:08 AM

I Get My Confidence From My Bowlers: Rajat Patidar

PC: BCCI/IPL.com

ఐపీఎల్‌-2025లో రాయల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తిరిగి మ‌ళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వ‌చ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించింది.  174 ప‌రుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవ‌లం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.

ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ఫిల్ సాల్ట్‌( 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 65) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. విరాట్ కోహ్లి(62), ప‌డిక్క‌ల్‌(40) ఆజేయంగా నిలిచి మ్యాచ్ ఫినిష్ చేశారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 173 ప‌రుగులు చేసింది. రాజ‌స్తాన్ బ్యాట‌ర్ల‌లో య‌శ‌స్వి జైశ్వాల్‌(75) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.

"ఇక ఈ విజ‌యంపై మ్యాచ్ అనంత‌రం ఆర్సీబీ కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ స్పందించాడు. జ‌ట్టు ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల పాటిదార్ సంతోషం వ్య‌క్తం చేశాడు. తిరిగి మ‌ళ్లీ గెలుపు బాట ప‌ట్ట‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌల‌ర్లు అద్భుతంగా త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను  అమ‌లు చేశారు. 

పవర్‌ప్లేలో అత్యుత్త‌మంగా బౌలింగ్ చేసి ప్ర‌త్య‌ర్ది బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేశారు. అదేవిధంగా ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయ‌డం అంత సులువు కాదు. ముందుగానే మేము 150-170 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాము. నా న‌మ్మ‌కం త‌గ్గ‌ట్టుగానే మా బౌల‌ర్లు బౌలింగ్ చేశారు. 

మా బౌల‌ర్లు ఎటువంటి వికెట‌పైనైనా బౌలింగ్ చేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. వారు నాకు పూర్తి న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నారు. సాల్ట్ గురుంచి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. డ‌గౌట్‌లో కూర్చుని అత‌డి బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాను. అత‌డితో పాటు విరాట్ ఇన్నింగ్స్ కూడా మాకు ఎంతో ప్ర‌త్యేకమ‌ని" పోస్ట్ మ్యాచ్ ప్రేజెంటేష‌న్‌లో పాటిదార్ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement