మాథ్యూ షార్ట్‌ విధ్వంసం.. హ్యారీ బ్రూక్‌ ఊచకోత

Hundred League: Matthew Short And Harry Brook Blasts 50s Vs Southern Brave - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌-2023లో భాగంగా సథరన్‌ బ్రేవ్స్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 6) జరుగుతున్న మ్యాచ్‌లో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ఆటగాళ్లు మాథ్యూ షార్ట్‌, హ్యారీ బ్రూక్‌ శివాలెత్తిపోయారు. ఓపెనర్‌గా వచ్చిన షార్ట్‌ (36 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్‌ (27 బంతుల్లో 63 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు.

వీరిద్దరికి టామ్‌ బాంటన్‌ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్‌) కూడా తోడవ్వడంతో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బ్రేవ్స్‌ బౌలర్లలో రెహాన్‌ అహ్మద్‌, తైమాల్‌ మిల్స్‌ తలో వికెట్‌ పడగొట్టి కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేయగా, మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలో ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఛార్జర్స్‌ చేసిన స్కోరే (201) అత్యధిక టీమ్‌ స్కోర్‌గా రికార్డైంది. 2021 ఎడిషన్‌లో ఇదే సూపర్‌ ఛార్జర్స్‌ చేసిన 200 స్కోర్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు టాప్‌ స్కోర్‌గా ఉండింది. 

202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్‌ బ్రేవ్స్‌.. 48 బంతుల తర్వాత 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను  కొనసాగిస్తుంది. డెవాన్‌ కాన్వే (15), ఫిన్‌ అలెన్‌ (10) ఔట్‌ కాగా.. జేమ్స్‌ విన్స్‌ (32), డు ప్ల్యూయ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top