Hockey India: హాకీ ఇండియా సీఈఓ ఎలీనా రాజీనామా | Hockey India CEO Elena Norman Resigns After 13 Years, Check Details Inside- Sakshi
Sakshi News home page

Hockey India CEO Resigns: హాకీ ఇండియా సీఈఓ ఎలీనా రాజీనామా

Feb 28 2024 9:27 AM | Updated on Apr 27 2024 1:08 PM

Hockey India CEO Elena Norman Resigns Check Details - Sakshi

ఎలీనా (PC: X)

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ)లో మరో కుదుపు!... 13 ఏళ్లుగా హాకీ ఇండియాకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్‌ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్‌ కోచ్‌ యానిక్‌ షాప్‌మన్‌ కూడా రాజీనామా చేసింది.

‘భారత హాకీలోని రెండు  గ్రూపుల మధ్య విబేధాలతో గురుతర బాధ్యతలు నిర్వర్తించడం చాలా కష్టం. మూడు నెలలుగా జీతం నిలిపి వేశారు. సంప్రదింపులు, సముదాయింపుతో గతవారం పూర్తిగా జీతం చెల్లించారు’ అని 49 ఏళ్ల ఎలీనా వివరించారు.

2011లో సీఈఓగా నియమితులైన ఎలీనా హయాంలోనే భారత్‌లో రెండు పురుషుల ప్రపంచకప్‌లు (2018, 2023), రెండు జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌లు (2016, 2021) విజయవంతంగా నిర్వహించారు.  

చదవండి: క్రికెట్‌పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement