
జూనియర్ పురుషుల హాకీ చాంపియన్‌షిప్
జలంధర్: హాకీ ఇండియా (హెచ్‌ఐ) జూనియర్ పురుషుల జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర ప్రదేశ్‌కు ఘోర పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కర్ణాటక 10–1 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్‌పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. కర్ణాటక తరఫున హర్‌పాల్ (12వ, 35వ నిమిషాల్లో), తనీశ్ రమేశ్ (17వ, 56వ ని.) చెరో రెండు గోల్స్ సాధించారు.
మిగతా వారిలో రాజు మనోజ్ గైక్వాడ్ (5వ ని.) నితీశ్ శర్మ (10వ ని.) కెపె్టన్ ధ్రువ (25వ ని.), అచ్చయ్య (24వ ని.), కుశాల్ బోపయ్య (51వ ని.), పూజిత్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. మిగతా మ్యాచ్‌ల్లో హరియాణా 3–0తో దాద్రా నగర్ హవేలిపై విజయం సాధించగా, ఉత్తర ప్రదేశ్ 9–2తో మహారాష్ట్రపై జయభేరి మోగించింది. ఆతిథ్య పంజాబ్ 8–4తో తమిళనాడుపై గెలుపొందింది.