IND vs IRE: అందుకే గైక్వాడ్‌ బ్యాటింగ్‌కు రాలేదు: హార్దిక్‌ పాండ్యా

Hardik Pandya reveals why Ruturaj Gaikwad didnt bat in 1st T20I - Sakshi

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. డబ్లిన్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్‌ నిర్ధేశించిన 109 పరుగుల టార్గెట్‌ను అలవోకగా టీమిండియా చేధించింది. ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ స్థానంలో దీపక్‌ హుడా బ్యాటింగ్‌ రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే రుత్‌రాజ్‌ బ్యాటింగ్‌కు రాకపోవడానికి గల కారణాన్ని మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌  హార్దిక్‌ పాండ్యా వెల్లడించాడు. గైక్వాడ్‌ మోకాలి గాయంతో బాధపడుతున్నాడని, ముందుజాగ్రత్త చర్యగా అతడిని బ్యాటింగ్‌కు పంపలేదని పాండ్యా చెప్పాడు. "రుతు మోకాలి గాయంతో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతడు ఓపెనింగ్ చేయడానికి సిద్దమయ్యాడు.

కానీ ఎటువంటి రిస్క్‌ తీసుకోడదని మేము భావించాము. ఎందుకంటే మ్యాచ్‌ కంటే ఆటగాడి శారీరక శ్రేయస్సు చాలా ముఖ్యమైనది. మా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ మేము విజయం సాధించాము. కాబట్టి గైక్వాడ్‌ బ్యాటింగ్‌కు రాకపోవడం జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు" అని మ్యాచ్‌ అనంతరం విలేకరుల సమావేశంలో హార్ధిక్‌ పాండ్యా పేర్కొన్నాడు.
చదవండి: IND vs IRE: చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలి భారత కెప్టెన్‌గా..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top