IND vs IRE: చరిత్ర సృష్టించిన హార్దిక్‌ పాండ్యా.. తొలి భారత కెప్టెన్‌గా..!

Hardik Pandya Becomes First Indian Captain To Pick A Wicket In T20s - Sakshi

ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో వికెట్‌ పడగొట్టిన తొలి భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన పాండ్యా.. పాల్‌ స్టిర్లింగ్‌ను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా ఈ ఘనతను పాండ్యా తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు దూరం కావడంతో తొలి సారి భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా ఎంపికయ్యాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐర్లాండ్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 12 ఓవర్లలో త ఐర్లాండ్‌ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.

ఐర్లాండ్‌ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్‌(64) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో  భువనేశ్వర్‌ కుమార్‌, పాండ్యా, అవేశ్ ఖాన్‌, చహల్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఇక 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 9.2 ఓవర్లలో మూడు  వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో దీపక్‌ హుడా(47), ఇషాన్‌ కిషన్‌(26), హార్ధిక్‌ పాండ్యా(24) పరుగులతో రాణించారు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టీ20 డబ్లిన్‌ వేదికగా మంగళవారం జరగనుంది.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ సంచలన నిర్ణయం..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top