ఫిలిప్స్‌కు గాయం... ఐపీఎల్‌కు దూరం | Gujarat Titans all rounder Glenn Phillips ruled out of IPL due to injury | Sakshi
Sakshi News home page

ఫిలిప్స్‌కు గాయం... ఐపీఎల్‌కు దూరం

Apr 13 2025 2:06 AM | Updated on Apr 13 2025 2:06 AM

Gujarat Titans all rounder Glenn Phillips ruled out of IPL due to injury

అహ్మదాబాద్‌: గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌కు చెందిన ఫిలిప్స్‌ గాయం కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండబోడని గుజరాత్‌ ఫ్రాంచైజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తాజా సీజన్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన ఫిలిప్స్‌... ఈ నెల 6న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. 

ఆ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో రైజర్స్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో కిందపడ్డాడు. ఈ సమయంలో అతడి గజ్జల్లో గాయమైంది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడు కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టనుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరుగు పయనం కాగా... ఇప్పుడు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు గ్లెన్‌ ఫిలిప్స్‌ సేవలను కూడా కోల్పోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement