
ప్రపంచ బాక్సింగ్ నిర్ణయం
లాస్ ఏంజెలిస్: ఒలింపిక్ బాక్సింగ్ ఈవెంట్‌లో ఇకపై లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గతంలో పురుషుల స్థాయి హార్మోన్లతో ఉన్న మహిళా బాక్సర్లు పోటీలకు దిగినపుడు విమర్శలు వచ్చాయి. ఇకపై ఇలాంటి విమర్శలు పునరావృతం కాకూడదనే ఉద్దశంతో మహిళా ఈవెంట్లలో పోటీ పడే ప్రతి ఒక్కరికి పరీక్షలు తప్పనిసరి చేశారు. ఇందులో భాంగా వచ్చే నెలలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే బాక్సర్లకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు ప్రపంచ బాక్సింగ్ అధ్యక్షుడు బోరిస్ వాన్ డిర్ వోర్స్ వెల్లడించారు.
‘సమాఖ్య అందరిపట్ల హుందాగా వ్యవహరిస్తుంది. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది’ అని బోరిస్ అన్నారు. బాక్సింగ్ లాంటి పోరాట క్రీడలో భద్రత, పోటీతత్వం సమన్యాయంను పాటించాల్సి ఉంటుందని, మరింత జవాబుదారీతనం, పారదర్శకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. జీవసంబంధ లింగ సూచిక అయిన ‘వై’ క్రోమోజోమ్ జన్యువుల ఉనికిని ఈ పరీక్షల్లో నిర్ధారిస్తారు. ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో సెపె్టంబర్‌లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి.
గత జూన్‌లో అల్జీరియాకు చెందిన ఇమాన్ ఖెలిఫ్‌ను నెదర్లాండ్స్‌లో జరిగిన పోటీల్లో అనుమతించలేదు. నిర్ధారిత టెస్టుల తర్వాతే అనుమతిస్తామని తెగేసి చెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఆమెతో పాటు లిన్ యూ తింగ్ (చైనీస్ తైపీ) శారీరక సామర్థ్యంలో ఉన్న తేడాల వల్ల పెను విమర్శలకు దారితీసింది. వీరిని మహిళల ఈవెంట్‌లో అనుమతించడమేంటని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బాక్సింగ్ లింగ నిర్ధారణ పరీక్షల్ని తప్పనిసరి చేసింది.