WC 2023: ఇంగ్లండ్‌ను చూస్తుంటే దేశం కోసం ఆడుతున్నట్లు లేదు.. గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

Gautam Gambhir criticizes Englands batting in loss to Sri Lanka - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ తమ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్‌ జట్టు ఓటమి చవిచూసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్‌ స్టోక్స్‌(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.

157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది.

ఈ వరల్డ్‌కప్‌లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇంగ్లండ్‌ జట్టుపై మాజీ క్రికెటర్‌లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ చేరాడు.  స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పాల్గోన్న గంభీర్‌కు.. ఇంగ్లండ్‌ ఓటములకు బ్యాటింగ్‌ కారణమా? బౌలింగ్‌ కారణమన్న ప్రశ్న ఎదురైంది.

"ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండింటిల్లోనూ నిరాశపరిచింది. వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌ నుంచే ఇంగ్లండ్‌ జట్టు చాలా నిరూత్సహంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌ తీరు అయితే మరి దారుణంగా ఉంది. మొత్తం బ్యాటింగ్ యూనిట్‌లో ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో ఆడినట్లు కన్పించడం లేదు. 

జట్టులో చాలా ‍మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారు తప్ప దేశం కోసం కాదు. శ్రీలంకపై మొదటి 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 350 పరుగులపైగా వస్తుంది అనుకున్నాను. కానీ ఏ ఒక్క బ్యాటర్‌ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు.

జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్‌ను పారేసుకున్నారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. అందుకే వారు విజయం సాధించారు" అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-11-2023
Nov 12, 2023, 15:12 IST
హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్‌ ప్రస్తుత వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో భీకరఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ మరో హాఫ్‌ సెంచరీ తన...
12-11-2023
Nov 12, 2023, 13:36 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో చివరి లీగ్‌ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు...
12-11-2023
Nov 12, 2023, 13:25 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌కు ముందు దక్షిణాఫ్రికా బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ టెంబా బావుమా గాయం కారణంగా...
12-11-2023
Nov 12, 2023, 12:32 IST
అఫ్గానిస్తాన్‌ స్టార్‌ ఓపెనర్‌ రహ్మానుల్లా గుర్బాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే గుర్భాజ్‌.. ఆఫ్‌ది...
12-11-2023
Nov 12, 2023, 12:05 IST
పాకిస్తాన్‌ క్రికెట్ టీమ్‌.. వన్డే ప్రపంచకప్‌-2023 టైటిల్‌ ఫేవరేట్‌గా భారత గడ్డపై అడుగుపెట్టిన జట్లలో ఒకటి. కానీ అందరి అంచనాలను...
12-11-2023
Nov 12, 2023, 09:18 IST
వన్డే ప్రపంచకప్‌-2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న భారత్‌-నెదర్లాండ్‌ మ్యాచ్‌తో ఈ ​మెగా టోర్నీ లీగ్‌ స్టేజి ముగియనుంది....
12-11-2023
Nov 12, 2023, 08:53 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023ను పాకిస్తాన్‌ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 93...
12-11-2023
Nov 12, 2023, 07:44 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా తమ అఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమైంది. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో...
11-11-2023
Nov 11, 2023, 21:37 IST
వన్డే ప్రపంచకప్‌-2023ను ఇంగ్లండ్‌ విజయంతో ముగించింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తమ ఆఖరి మ్యాచ్‌లో 93 పరుగుల...
11-11-2023
Nov 11, 2023, 21:09 IST
ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీల్లో 1000 పరుగులు చేసిన తొలి...
11-11-2023
Nov 11, 2023, 20:13 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు అర్హత...
11-11-2023
Nov 11, 2023, 19:32 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో...
11-11-2023
Nov 11, 2023, 19:01 IST
పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 18:20 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ను అద్బుతమైన విజయంతో ఆస్ట్రేలియా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా పుణే...
11-11-2023
Nov 11, 2023, 18:06 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో ఇంగ్లండ్‌ ఎట్టకేలకు తమ బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా తమ ఆఖరి లీగ్‌...
11-11-2023
Nov 11, 2023, 17:15 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో పాకిస్తాన్‌ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన పాకిస్తాన్‌.. తర్వాతి...
11-11-2023
Nov 11, 2023, 16:35 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌...
11-11-2023
Nov 11, 2023, 15:47 IST
వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ సెమీఫైనల్స్‌కు చేరకపోయినప్పటికీ.. తమ అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో...
11-11-2023
Nov 11, 2023, 14:13 IST
ICC WC 2023- Is Pakistan Knocked Out: వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసులో నిలుస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన...
11-11-2023
Nov 11, 2023, 13:53 IST
ICC WC 2023- Team India: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందని వెస్టిండీస్‌ క్రికెట్‌...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top